Asianet News TeluguAsianet News Telugu

Republic Day: తెలుగు కళాకారుడికి అరుదైన గుర్తింపు... రిపబ్లిక్ డే పరేడ్‌లో కలంకారీ హ్యాండ్ పెయింటింగ్

గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తికి చెందిన ఆర్టిస్ట్ సుధీర్ రూపొందించిన కలంకారీ కళ స్క్రోల్‌పై ఉంటుంది. 

telugu kalamkari artist sudheer got excellence
Author
New Delhi, First Published Jan 20, 2022, 7:43 PM IST

సంప్రదాయం , చరిత్రలో సంపన్నమైన భారతదేశ వైవిధ్యభరితమైన జానపద కళారూపాలు శతాబ్దాలుగా ఉత్తేజకరమైన దృశ్య ప్రాతినిధ్యం ద్వారా ఎన్నో కథలను వివరించాయి . వాటిలో ప్రతిఒక్కటి సాంస్కృతికంగా ప్రముఖమైనదే. పంజాబ్ లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్‌లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న ఇటువంటి కొన్ని సంప్రదాయాలను రాబోయే గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్‌పథ్‌లో ప్రదర్శించనున్నారు. రాజ్‌పథ్‌లోని ఒక ఓపెన్ గ్యాలరీలో, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్ జిఎంఎ) భారీ స్క్రోల్స్‌ను ప్రదర్శిస్తుంది. వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు. దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా కళాకారులు దీనిని చిత్రించారు.
 
గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తికి చెందిన ఆర్టిస్ట్ సుధీర్ రూపొందించిన కలంకారీ కళ స్క్రోల్‌పై ఉంటుంది. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై చేసే చేతి పెయింటింగ్ . కలంకారీ అనే పదం పర్షియన్ భాష నుండి ఉద్భవించింది. ఇక్కడ ' కలం ' అంటే కలం 'కరి' కళాత్మకతను సూచిస్తుంది. 

ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెంతో శ్రమతో కూడిన 23 దశలు ఉంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్‌లు, పువ్వులు, నెమలి ,పైస్లీల మొదలు మహాభారతం ,రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. ప్రస్తుతం ఈ కళ ప్రధానంగా కలంకారీ చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు. సుధీర్‌కు కలంకారీ కళలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఆయన హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం నుంచి పెయింటింగ్‌లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ (బివిఎ) పూర్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios