Asianet News TeluguAsianet News Telugu

మురుగుడు లావణ్య: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Murugudu Lavanya Biography: మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించేందుకు వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదనీ తొలుత గంజి చిరంజీవిని మంగళగిరి వైసిపి ఇన్చార్జిగా నియమించింది. కానీ అనూహ్యంగా గంజి చిరంజీవి ఆశలపై నీళ్లు చల్లుతూ మరోకరిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించింది వైసిపి అధిష్టానం. ఆ కొత్త అభ్యర్థే మురుగుడు లావణ్య. ఆమె రియల్ సోర్టీ మీ కోసం

Murugudu Lavanya Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 29, 2024, 1:01 PM IST

Murugudu Lavanya Biography: ఏపీలో మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం కావడం, అలాగే మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇక్కడి నుంచే బరిలో నిలువడంతో అందరీ దృష్టి ఈ సెగ్మెంట్ పై ఉంటుంది. 2024 ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ ను ఓడించిన వైసీపీ నేత ఆల రామకృష్ణారెడ్డినే మళ్ళీ బరిలో దించుతారని అందరూ భావించారు.

కానీ, గంజి చిరంజీవిని మంగళగిరి వైసిపి ఇన్చార్జిగా నియమించారు. కానీ అనూహ్యంగా గంజి చిరంజీవి ఆశలపై నీళ్లు చల్లుతూ మరోకరిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించింది వైసిపి అధిష్టానం. ఇంతకీ ఆ కొత్త అభ్యర్థి ఎవరు? ఆ అభ్యర్థి బ్యాగ్రౌండ్ ఏంటి? అని చాలా మంది నెట్టింట్లో తెగ వెతుకున్నారు. ఆ కొత్త అభ్యర్థే మురుగుడు లావణ్య. ఆమె రియల్ సోర్టీ మీ కోసం. 

మురుగుడు లావణ్య విషయానికి వస్తే.. మురుగుడు లావణ్య మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారి కోడలు. ఇక కాండ్రు కమలకు దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్ రాజశేఖర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే.. మురుగుడు హనుమంతరావు తొలిసారి మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆయన క్రమంగా మంగళగిరి ప్రాంతాన్ని తన రాజకీయ కేంద్రంగా మార్చుకుని,  1999, 2004 ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే.. 2004లో వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు మురుగుడు హనుమంతరావు .  ప్రస్తుతం ఎమ్మెల్సీగా, ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

ఇక మురుగుడు లావణ్య తల్లి గారు  కాండ్రు కమల విషయానికి వస్తే.. ఆమె  2000-2005 మధ్యకాలంలో మంగళగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ నుంచి 2009లో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్‌గా కూడా పనిచేశారు. అలా మురుగుడు లావణ్య అమ్మగారి కుటుంబం, అటు అత్తగారి కుటుంబం రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇలా మంగళగిరి పై మంచి పట్టున్న కుటుంబాలకు చెందిన లావణ్య అయితే నారా లోకేశ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios