Asianet News TeluguAsianet News Telugu

అడిగినంత ఇవ్వలేకపోయాం.. జగన్ కూడా బాధపడుతున్నారు, ఉద్యోగులు ఆలోచించాలి: పీఆర్సీపై పేర్ని నాని

ఉద్యోగుల పట్ల సీఎంకు ప్రేమ, సానుభూతి లేకపోతే 30 రోజుల్లోనే మధ్యంతర భృతి ప్రకటించలేదా..? అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని (perni nani) . ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేపోయినందుకు బాధగానే వుందన్నారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లోనే ఇలా చేయాల్సి వస్తోందని పేర్ని నాని పేర్కొన్నారు. 

minister perni nani comments on prc
Author
Amaravathi, First Published Jan 20, 2022, 5:49 PM IST

ఉద్యోగుల పట్ల సీఎంకు ప్రేమ, సానుభూతి లేకపోతే 30 రోజుల్లోనే మధ్యంతర భృతి ప్రకటించలేదా..? అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని (perni nani) . గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేపోయినందుకు బాధగానే వుందన్నారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లోనే ఇలా చేయాల్సి వస్తోందని పేర్ని నాని పేర్కొన్నారు. కన్నబిడ్డలు అడిగినంత ఇవ్వలేకపోతే తల్లి ఎంత బాధపడుతుందో జగన్ అంతే బాధపడుతున్నారని మంత్రి తెలిపారు. 23 శాతం ఫిట్‌మెంట్‌ను (fitment) కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇస్తున్నామని పేర్ని నాని చెప్పారు. 

ఇవన్నీ ఉద్యోగుల పట్ల ప్రేమతో తీసుకున్న నిర్ణయాలు కావా అని మంత్రి ప్రశ్నించారు. మొత్తంగా జీతం పెరిగిందా..? లేదా అనేది చూడాలని పేర్ని నాని తెలిపారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవమని.. ఉద్యోగులపై ప్రేమ ఒలకబోస్తూ కొందరు నక్క వినయాలు ప్రదర్శిస్తున్నాయన్నారు. టీడీపీ, బీజేపీలు ఒక్క కొత్త ఉద్యోగమైనా ఇచ్చాయా అని మంత్రి ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు దళారీ సమస్య లేకుండా జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్లాలని పేర్ని నాని సూచించారు. కరోనాతో ప్రభుత్వం ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని.. కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు కూడా తగ్గాయన్నారు. కొందరు సందట్లో సడేమియాలు బయల్దేరారని.. ఉద్యోగులపై కేసులు పెట్టి వేధించింది వాస్తవమా..? కాదా అని పేర్ని నాని నిలదీశారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios