Asianet News TeluguAsianet News Telugu

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Mareddy Ravindranath Reddy Biography: మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి. కడప రాజకీయాల్లో కీలక నేత. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డికి ప్రత్యార్థిగా టీడీపీ తరుపున బరిలో దిగుతున్నారు పులివెందుల బీటెక్ రవి. ఈ నేపథ్యంలో బీటెక్ రవి రాజకీయ ప్రస్థానం మీ కోసం.. 

Mareddy Ravindranath Reddy Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 30, 2024, 11:30 PM IST

Mareddy Ravindranath Reddy Biography: మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి. కడప రాజకీయాల్లో కీలక నేత. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డికి ప్రత్యార్థిగా టీడీపీ తరుపున బరిలో దిగుతున్నారు పులివెందుల బీటెక్ రవి. ఈ నేపథ్యంలో బీటెక్ రవి రాజకీయ ప్రస్థానం మీ కోసం.. 

జననం, విద్యాభ్యాసం

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి.  1970 ఫిబ్రవరి 10న ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామంలో మారెడ్డి కృష్ణారెడ్డి-సరస్వతమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాటి నుంచి చదువు చురుకగా ఉండే రవీంద్రనాథ్ రెడ్డి ప్రాథమిక విద్య, ఉన్నత విద్య స్థానిక జిల్లాలోనే సాగింది. ఆ తరువాత ఉన్నత ఆశయాలతో 1992లో కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ యూనివర్సిటీ నుండి బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత విదేశాలకు వెళ్లాలని భావించారు. కానీ, ఓ అక్రమ కేసులో చిక్కుకోవడంతో ఇబ్బందుల పాలయ్యాడు. 

రాజకీయ జీవితం 

ఈ తరుణంలో మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాక బిటెక్ రవిగా అందరికీ సుపరిచితం.  ఈ పేరు రావడం వెనుక ఓ స్టోరీ ఉంది. ఆయన టీడీపీలో చేరే నాటికి పార్టీలో చాలా రవి, రవీందర్ అనే పేరుతో నాయకులుండేవారు. దీంతో మారెడ్డి రవీంద్రనాథ్ ను సులభంగా గుర్తించడానికి.. అలాగే ఆ పార్టీలో బిటెక్ చేసిన ఏకైక లీడర్ ఇతడే కావడంతో ఈయనని సపరేట్గా బీటెక్ రవి అని పిలవడం మొదలుపెట్టారు ఆ విధంగా బిటెక్ రవి స్థిరపడిపోయింది. 

ఇక 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి పులివెందుల నియోజకవర్గం నుంచి టిడిపి నుండి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. కానీ, వెనుకడుగు వేయలేదు. 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల స్థానం నుండి ఎమ్మెల్సీగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇలా మొదటిసారిగా 46 సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఓటమి ఎరుగని వైయస్సార్ కుటుంబం మీద ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రస్థాయిలో చరిత్ర సృష్టించారు.

వాస్తవానికి  ఆ ఎన్నికల్లో వైయస్ వివేక, బీటెక్ రవి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే బీటెక్ రవికి ఈ విజయం సులభంగా సాధ్యం కాలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని వైసీపీ భావించింది. కానీ,  కడప జిల్లాలోని టిడిపి పార్టీ నేతలు ఐకమత్యంగా వ్యవహరించి, అనేక ప్రయాసలకు తగ్గుకుని పార్టీని గెలిపించారు. మొత్తానికి వైయస్ఆర్ కంచుకోట  బద్దలు కొట్టారు బీటెక్ రవి. ఈ విజయంతో బీటెక్ రవి పేరు రాష్ట్రం మొత్తం వినిపించింది. కడప రాజకీయాల్లో కీలక నేతగా మారాడు. 

రాజీనామా

 ఆంద్రప్రదేశ్ లో మూడు రాజ‌ధానుల బిల్లును గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన నేపథ్యంలో అందుకు నిరసనగా తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆయన నవంబర్ 2020లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు. పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి అని అన్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డికి ప్రత్యార్థిగా టీడీపీ తరుపున బరిలో దిగుతున్నారు పులివెందుల బీటెక్ రవి. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవర్నీ వరిస్తుందో వేచి చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios