Asianet News TeluguAsianet News Telugu

కిడ్నాపైన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ జీవీ క్షేమం..నిర్థారించిన పోలీసులు..

విశాఖపట్నంలో సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, అడిటర్ లను కిడ్నాప్ చేసిన ఘటనలో ఆడిటర్ జీ. వెంకటేశ్వరరావు ఆచూకీ కనిపెట్టారు పోలీసులు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. 

Kidnaped MP MVV Satyanarayana's auditor GV safe.. Police confirmed - bsb
Author
First Published Jun 15, 2023, 12:41 PM IST

విశాఖపట్నం : ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలు ఈ ఉదయం కిడ్నాపర్లు అపహరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆడిటర్ జీవీ ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఆయన క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ రోజు ఉదయం రిషికొండలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోకి దూరిన దుండగులు ఆయన భార్య, కొడుకులతో పాటు ఆడిటర్ జీవీలను కిడ్నాప్ చేశారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాద్ లో ఉన్నారు.

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ల కిడ్నాప్ ..

ఉదయం ఎంపీ ఇంటికి చేరుకున్న దుండగులు సీతమ్మధారలో ఉన్న జీవీకి ఎంపీ భార్య, కొడుకులతో ఫోన్ చేయించారు. ఆయన వచ్చాక ముగ్గురిని అపహరించారు. ప్రధానంగా రౌడీ షీటర్ హేమంత్ అనే అతని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీవీ అనేక కంపెనీలకు అడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆ కంపెనీలకు అడిటర్ గా జీవీ వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాపార గొడవలే కిడ్నాప్ కు కారణమా? అనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు. అయితే, దీనిమీద పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కిడ్నాప్ అయిన సమాచారం మాత్రమే వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇటీవలే రుషికొండలో కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి మారారు సత్యనారాయణ. అధికార పార్టీ ఎంపీ భార్య, పిల్లలు కిడ్నాప్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా రౌడీ షీటర్ హేమంతో మీద ఇది వరకు రౌడీషీట్ కూడా ఉంది. ఆయన పాత్ర ఎంత వరకు ఉందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios