Asianet News TeluguAsianet News Telugu

జగ్గంపూడి రాజా: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Jakkampudi Raja Biography: ఏపీ రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరుపొందిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు. ఆయన బాటలోనే ఆయన తనయుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నడుస్తున్నారు. తన నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి రాజానగరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున  బరిలో నిలిచారు.  ఈ నేపథ్యంలో ఆయన  వ్యక్తిగత, రాజకీయ జీవిత ప్రయాణంపై ప్రత్యేక కథనం.

Jakkampudi Raja Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 31, 2024, 2:41 AM IST

Jakkampudi Raja Biography: ఏపీ రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరుపొందిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు. ఆయన బాటలోనే ఆయన తనయుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నడుస్తున్నారు. తన నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి రాజానగరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున  బరిలో నిలిచారు.  ఈ నేపథ్యంలో ఆయన  వ్యక్తిగత, రాజకీయ జీవిత ప్రయాణంపై ప్రత్యేక కథనం.

బాల్యం, విద్యాభ్యాసం
 
జక్కంపూడి రాజా 1989లో ఏపీలోని తూర్పు గోదావరి, రాజానగరంలో జక్కంపూడి రామ్మోహనరావు - విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. జక్కంపూడి రాజా గీతం యూనివర్సిటీ దూర విద్య ద్వారా తొలుత బీ.కామ్ డిగ్రీని, ఆ తరువాత అదే యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ మోడ్ లో ఎంబీఏ పూర్తి చేశాడు.  జగ్గంపూడి రాజా గురించి తెలుసుకునే ముందు డైనమిక్ లీడర్ మాజీ మంత్రి ఆయన తండ్రి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి తెలుసుకోవాలి.

జక్కంపూడి రామ్మోహనరావు బయోగ్రఫీ

జక్కంపూడి రామ్మోహనరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1989లో కడియం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ తరువాత  1999 ఎన్నికల్లో కడియం నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖల మంత్రిగా పని చేశాడు.

ఆయన అనారోగ్యంతో మూడేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి 15 డిసెంబర్ 2010న కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు. అలాగే. జక్కంపూడి రామ్మోహనరావు  కాపునేతల్లో ఆయన ఒకరు. అలాగే.. ఆయన వైఎస్ ఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన్ని తన ఇంటి సభ్యుడిగా చూసేవారు.  వైయస్ అనుచరుడు కావడం వల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక కాపు ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్రంగా హత్యకు గురైన సందర్భంగా ఆయన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ఆయనపై కూడా కేసులు నమోదు చేసింది. 
 
రాజకీయ జీవితం

జక్కంపూడి రాజా తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రాజానగరం నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ పై 31772 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ తరుణంలో ఆయనను జగన్ తన నియోజకవర్గంలో తీసుకుంటాడనీ  భావించారు. కానీ, రాజాను ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా 29 జూలై 2019న నియమించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ  వారి సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు. 

ఏపీ రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరుపొందిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు. ఆయన బాటలోనే ఆయన తనయుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నడుస్తున్నారు. తన నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా.. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి రాజానగరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున  బరిలో నిలిచారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios