Asianet News TeluguAsianet News Telugu

దూసుకొస్తున్న జ‌వాద్ తుఫాన్‌.. ఏపీలో హైఅలెర్ట్‌

జవాద్ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. తుఫాన్ వల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. 

Hurricane Jawad looming .. High alert in AP
Author
Amaravathi, First Published Dec 4, 2021, 1:32 PM IST

జ‌వాద్ తుఫాన్ ఏపీని వ‌ణికిస్తోంది. బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తుఫాన్ ఏపీపై ప్ర‌భావం చూపుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఈ తుఫాన్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఏపీతో పాటు మారు 5 రాష్ట్రాల‌కు కూడా సూచ‌న‌లు చేసింది. ఈ తుఫాన్‌కు ‘జవాద్’గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలోని ప‌లు  ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జవాద్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. 

అలెర్ట్ గా ఉన్న అధికార యంత్రాంగం..
జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ యంత్రాంగం మొత్తం అలెర్ట్ అయ్యింది. అన్ని ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌స్తుతం తుఫాన్ చురుకుగా క‌దులుతోంది. రేపు ఉద‌యం ఒడిషాలో తీరందాటే అవ‌కాశం ఉంది. జవాద్ వ‌ల్ల విశాఖ‌ప‌ట్నం, విజ‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో ఈ జిల్లాలో ఏపీ ప్ర‌భుత్వం రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించింది. విశాఖ జిల్లాలోని స్కూళ్ల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 5 రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించింది. 21 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో వినియోగించుకునేందుకు వీలుగా ప‌లు హెలిక్యాప్ట‌ర్ల‌ను కూడా అందుబాటులో ఉంచింది. స‌హ‌యాక చ‌ర్య‌ల కోసం 13 ఫ్ల‌డ్ రిలీఫ్ టీమ్స్ ఏర్పాటుఉత్త‌రాంధ్ర‌లో ఎన్‌డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌, బృందాల‌తో పాటు మ‌రో 4 అద‌న‌పు బృందాల‌ను కూడా అందుబాటులో ఉంచామ‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ క‌మిష‌నర్ క‌న్న‌బాబు ప్ర‌క‌టించారు. లోత‌ట్టు ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. 

96 రైళ్లు ర‌ద్దు..
ఈ జవాద్ తుఫాన్ కార‌ణంగా ఏపీలో 96 రైళ్ల‌ను ర‌ద్దు చేశారు.  భువ‌నేశ్వ‌ర్‌- రామేశ్వ‌రం, హౌరా- సికింద్ర‌బాద్‌, పూరి-య‌శ్వంత్‌పూర్‌, హౌరా-య‌శ్వంత్‌పూర్‌, హౌరా- చెన్నై, పాట్నా- ఎర్నాకులం, భువ‌నేశ్వ‌ర్ - బెంగ‌ళూరు, భువ‌నేశ్వ‌ర్‌- సికింద్ర‌బాద్, పురూలియా- విల్లూపురం, పూరి-తిరుపతి, హౌరా-హైద‌రాబాద్‌, హౌరా-మైసూర్‌, రాయ‌గ‌డ‌-గుంటూరు, సంబ‌ల్‌పుర్‌-నాందేడ్‌, టాటా-య‌శ్వంత్‌పూర్‌, హ‌తియా-బెంగుళూరు, భువ‌నేశ్వ‌ర్- గౌహ‌తి, త్రివేంద్రం-శాలిమార్‌..ఇలా ప‌లురైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. పుర‌
విజ‌య‌న‌గ‌రం, రాయ‌గ‌డ రైల్వే స్టేష‌న్ల‌లో హెల్ప్ లైన్ సెంట‌ర్లు ఏర్పాటు చేశారు.

వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష‌..
తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల సీఎంవో అధికారుల‌తో, క‌లెక్ట‌ర్ ల‌తో ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వహించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకొని అలెర్ట్ గా ఉండాల‌ని అన్నారు. అవ‌స‌ర‌మైన చోట స‌హాయ శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. తుఫాన్ ప్ర‌భావం వ‌ల్ల ఏ ఒక్క‌రూ ఇబ్బంది ప‌డ‌కూడద‌ని తెలిపారు. ఉత్త‌రాంధ్ర‌లో తుఫాన్ స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త‌ను ముగ్గురు సీనియ‌ర్ అధికారుల‌కు సీఎం అప్ప‌గించారు. శ్రీ‌కాకులం జిల్లాకు హెచ్‌.అరుణ్‌కుమార్, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామ‌ల రావును నియ‌మించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తూ అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు.  గులాబ్ తుఫాన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios