Asianet News TeluguAsianet News Telugu

గద్దె రామ్మోహన్ రావు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Gadde Ramamohan Biography: కాంగ్రెస్‌ కంచుకోట అయినా విజయవాడ (తూర్పు) నియోజకవర్గంలో తెలుగుదేశం పోరాటం చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టేందుకు టీడీపీ తహతహలాడుతుండగా...బోణీ చేసేందుకు వైసీపీ ఎదురుచూస్తోంది. ఈ సారి ఈ నియోజక వర్గం నుంచి  టీడీపీ,జనసేన,బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం..   

Gadde Ramamohan Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 31, 2024, 10:10 AM IST

Gadde Ramamohan Biography: కాంగ్రెస్‌ కంచుకోట అయినా విజయవాడ (తూర్పు) నియోజకవర్గంలో తెలుగుదేశం పోరాటం చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టేందుకు టీడీపీ తహతహలాడుతుండగా.. బోణీ చేసేందుకు వైసీపీ ఎదురుచూస్తోంది. ఈ సారి ఈ నియోజక వర్గం నుంచి  టీడీపీ,జనసేన,బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం..   

బాల్యం, విద్యాభ్యాసం

గద్దె రామ్మోహన్ రావు..  1959,జనవరి 9న కృష్ణా జిల్లా గన్నవరంలో గద్దె సుబ్బయ్య శ్రీనివాసులమ్మ దంపతులకు జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. ఆయన విద్యాభ్యాసం అంతా స్థానికంగానే సాగింది. గన్నవరంలోని వి.కె.ఆర్.కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన రామ్మోహన్ రావు ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి. (మైక్రోబయాలజీ) చేశారు. ఉన్నత విద్యావంతుడైన ఆయన చదువు పూర్తయిన తర్వాత వ్యాపారం చేయాలని భావించారు. వెంటనే వ్యాపారం మొదలు పెట్టారు. అనతికాలంలోనే సక్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. 1982లో అనూరాధతో ఆయన వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. 

రాజకీయ ప్రవేశం
 
పారిశ్రామిక వేత్త, సంఘసేవకుడుగా పేరుగాంచిన గద్దె రామ్మోహన్ రావు రాజకీయాలపై ఆసక్తితో 1994 లో పొలిటికల్ ఏంట్రీ ఇచ్చారు. తొలిసారి 1994 శాసనసభ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాసరి బాలవర్ధన్ రావు పై పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో ఆయన విజయంలో  రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. క్రమంగా పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. పార్టీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడుగా మారారు. 

ఇక 1999 సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గద్దె రామ్మోహన్ రావు తన సమీప ప్రత్యార్థి పర్వతనేని ఉపేంద్ర పై భారీ మెజారిటీతో గెలుపొందారు. తన పలు ప్రభుత్వ సంక్షేమ, సేవ కార్యక్రమాలను అందించడంలో సఫలిక్రుతుడయ్యారు. కానీ, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2009లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగడంతో ఈ ఎన్నికల్లో ఆయనకు మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. 2014లో మరోసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు.

ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి అయినా వంగవీటి రాధాకృష్ణపై 15 వేల ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 2019లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ నాయకుడు భవకుమార్ పై భారీ మెజారిటీతో గెలిచారు రామ్మోహన్. ఇక 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు సెగ్మెంట్లో టిడిపి, జనసేన,బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు మరోసారి బరిలో దిగుతుండగా.. వైసీపీ నుంచి దేవినేని అవినాష్ పోటీలో నిలిచారు. ఈ  ఉత్కంఠ పోరులో గెలుపు ఎవర్ని వరిస్తుందో వేచిచూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios