Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ , ఏపీ అసెంబ్లీ ఎన్నికలు .. వాలంటీర్లకు ఏ బాధ్యతలు అప్పగించొద్దు : మరోసారి తేల్చిచెప్పిన ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై ఎన్నికల విధుల కేటాయింపుపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మరోసారి స్పష్టత ఇచ్చింది. ఏపీలో ఎన్నికల విధుల్లో వాలంటీర్లు, కాంట్రాక్ట్ సిబ్బందిని దూరంగా వుంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. 

Election Commission Puts a Check on AP Volunteers over lok sabha and andhra pradesh elections ksp
Author
First Published Mar 16, 2024, 9:52 PM IST

వచ్చే లోక్‌సభ , ఆంధ్రప్రదేశ్ ‌అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల విధుల్లో వాలంటీర్లు, కాంట్రాక్ట్ సిబ్బందిని దూరంగా వుంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. సీఈసీ ఆదేశాల మేరకు వాలంటీర్లు ఎక్కడా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీల్లేందని.. సచివాలయ ఉద్యోగుల్లో మాత్రం ఒకరిని వాడుకునేందుకు అవకాశం వుందని సీఈసీ తెలిపారు. వారిని కేవలం ఇంకు వేసేందుకు మాత్రమే వినియోగించాలని .. దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని సీఈసీ చెప్పారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై గత నెల 14న సీఈసీ స్పష్టత ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలని సూచించింది. ఇతర ముఖ్యమైన పనులేవీ వారికి అప్పగించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి సూచించింది. ఎన్నికల విధుల కోసం గ్రామ , వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చింది. అయితే  ప్రతి పోలింగ్ పార్టీలోనూ రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని నియమించుకోవచ్చునని ఎన్నికల సంఘం తెలిపింది. 

బీఎల్వోలుగా పనిచేసిన సిబ్బందిని ఎట్టి పరిస్ధితుల్లోనూ పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని సూచించింది. బీఎల్వోలకు పోలింగ్ రోజున ఇతర పనులు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని సీఈవోకు సూచించింది. వాలంటర్లను కనీసం పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధుల అప్పగింతకు నో అబ్జెక్షన్ లెటర్ పంపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios