Asianet News TeluguAsianet News Telugu

లక్షల కోట్లు అప్పు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? జ‌గ‌న్ స‌ర్కార్ పై సోము వీర్రాజు సెన్సెష‌న‌ల్ కామెంట్స్

సీఎం జగ‌న్(CM Jagan)  పై బీజీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమర్శస్త్రాలు సంధించారు. అమరావతి రాజధానిపై జ‌గ‌న్ తీరును ప్ర‌శ్నించారు. ప్రజల ఆస్తులు అమ్మటం, తాకట్టు పెట్టడం తప్పా.. రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ది చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. 
 

BJP leader sensational comments on Amaravati capital
Author
Hyderabad, First Published Dec 4, 2021, 2:30 PM IST

అమరావతి రాజధానిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌మ పార్టీ  మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సోము వీర్రాజు మరోసారి ప్రకటించారు. విజయవాడ లో శ‌నివారం ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు MPలు, మాజీ మంత్రులు MLC లు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఏపీలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారనీ, అమరావతినే ఏపీ రాజ‌ధానిగా ఉండాల‌ని కోరుకుంటున్నార‌నీ, మోడీ స‌ర్కార్ కూడా.. ప్ర‌జ‌ల ఇష్టానూసారంగానే.. అమ‌రావ‌తిని అభివృద్ధి చేయ‌డానికి  కోట్లాది రూపాయాల నిధులను కేటాయించింద‌ని తెలిపింది. అలాగే.. రాజ‌ధాని అమరావతి చూట్టూ ప్లై ఓవర్స్,  రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందనీ, రాజధాని పై ఇతర పార్టీలకంటే బిజెపి కే పేటెంటు హక్కు ఉందని ప్ర‌క‌టించారు. 

Read Also:  https://telugu.asianetnews.com/andhra-pradesh/ap-cm-ys-jagan-visits-injured-woman-home-in-tirupati-r3jtfb

రాజ‌ధాని అభివృద్ధి బీజేపీ కృష్టి చేసిందనీ, ఇందుకోసం ఏ ప్ర‌భుత్వం లేని విధంగా కోట్లాది నిధుల‌ను కేటాయించ‌ద‌నీ, ఈ విష‌యంలో బీజేపీ చ‌ర్చ‌కు సిద్దంగా ఉంద‌ని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దాదాపు  60 లక్షల మంది కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఘనత మోడీ స‌ర్కార్ కు మాత్ర‌మే  దక్కుతుంది. కానీ.. కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌న్నీ వైసీపీ ప్ర‌భుత్వం చేసిన‌ట్టు ప్ర‌చారం చేసుకుంటున్నారని విమ‌ర్శించారు.  

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/bjp-national-secretary-satyakumar-was-comments-on-amravati-r3ji0m

జ‌గ‌న్ స‌ర్కార్.. అమ‌లు చేస్తున్న 35 సంక్షేమ ప‌థ‌కాలకు కేంద్రం నిధులందిస్తోంద‌నీ, ఆ ప‌థ‌కాల‌ను అమ‌లు ఒంట‌రిగా, కేంద్రం సహాయం చేయ‌కుండా అమలు చేసే ద‌మ్ము, ధైర్యం ఉందా? అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ స‌ర్కారే ప‌లు సంస్థ‌ల‌ను ప్ర‌యివేట్ ప‌రం చేసింద‌నీ, ఇప్ప‌టికే  రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ లు, పాల ఫ్యాక్టరీ నష్టాలు పేరుతో ప్రయివేటు ప‌రం చేశార‌ని విమ‌ర్శించారు. పైగా  విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారా?  అని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు ఆర్దిక సంఘం నిధులన్నింటినీ.. ప‌క్క దారి పట్టిస్తూ .. కేంద్రం మీద ప‌డి ఏడుస్తున్నార‌ని, అభివృద్ధికి అడ్డుగా మారిన జగన్మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని  స‌వాల్ విసిరారు.

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/complaint-over-change-of-names-of-central-schemes-in-ap-smriti-irani-seeking-details-r3jrdy

స్దానిక సంస్థల నిధులు, ఎన్ ఆర్ జీఎస్ నిధులతో గ్రామాల అభివృద్ధి చేయ‌డం మానేసి.. పార్టీ అభివృద్ధికి వాడుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి తప్పా.. ఏ మాత్రం  అభివృద్ధి లేదనీ, లక్షల కోట్లు అప్పచేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? అని రాష్ట్ర ఆర్దిక మంత్రికి ఓపెన్ చాలెంజ్ విసిరారు. ఏపీ సీఎం జగ‌న్ ప్రజల ఆస్తులు అమ్మటం, తాకట్టు పెట్టడం తప్పా.. రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ది చేశారా? అని ప్ర‌శ్నించారు. కేంద్ర పధకాలపై రాష్ట్ర ప్ర‌భుత్వం స్టిక్క‌ర్లు వేసుకోవ‌డం త‌ప్పా .. సొంత ప‌థ‌కాలు ఏమన్నా ఉన్నాయా? అని అడిగారు. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడానికి కారణం ఇసుక కాంట్రాక్టర్ల కోసం నిబంధనలు పాటించకపోవడమనీ, రాష్ట్ర ప్రజల మానసిక క్షోభకు జగన్మోహన్ రెడ్డి చర్యలే కారణమ‌ని అన్నారు. అమరావతి రైతులకు మద్దతు గా బిజెపి పాదయాత్ర చేస్తే.. జ‌గ‌న్ స‌ర్కార్ కేసులు పెట్టిందనీ, రాజధాని రైతులు పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొంటామ‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios