Asianet News TeluguAsianet News Telugu

ఈతకొలనులో అమ్మాయిలతో మందు తాగుతూ డ్యాన్స్: లోకేష్‌పై జగన్, బాబుపైనా సెటైర్లు

వాలంటీర్లపై  టీడీపీ, జనసేన చేస్తున్న విమర్శలకు  ఏపీ సీఎం వైఎస్ జగన్  కౌంటరిచ్చారు.  చంద్రబాబు,లోకేష్ పై  ఆయన  విమర్శలు చేశారు.

AP CM YS Jagan Serious Comments On Chandrababu Naidu And Lokesh lns
Author
First Published Jul 21, 2023, 1:03 PM IST

నెల్లూరు: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.నెల్లూరులో  శుక్రవారంనాడు  నేతన్న నేస్తం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వాలంటీర్లపై విమర్శలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కౌంటరిచ్చారు.  చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలపై  వ్యక్తిగత విమర్శలు చేశారు సీఎం జగన్.

వాలంటీర్లపై  విమర్శలకు చంద్రబాబు నిర్మాతైతే   నటన, మాటలన్నీ దత్తపుత్రుడివని  పవన్ కళ్యాణ్ పై  జగన్ విమర్శలు చేశారు. పదేళ్లుగా  చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నారన్నారు.

మందు తాగుతూ  అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో డ్యాన్సులు చేసిన లోకేష్ కు వాలంటీర్ల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని ఆయన  ప్రశ్నించారు. యూట్యూబ్ లో లోకేష్ వీడియోలు అనేకం కన్పిస్తాయని  సీఎం జగన్ గుర్తు  చేశారు. అమ్మాయిలు కన్పిస్తే కడుపులు చేయాలని చెప్పేవాడు మరోకడు అంటూ  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను  జగన్ ప్రస్తావించారు. ఓ సినిమా ఫంక్షన్ లో  అమ్మాయిలు కన్పిస్తే ముద్దైనా పెట్టాలి, లేదా కడుపైనా చేయాలని  బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ గుర్తు  చేశారు.75 ఏళ్లు వచ్చినా సిగ్గు లేకుండా  చేసిన తప్పులను సమర్ధించుకుంటున్నారని   చంద్రబాబుపై  జగన్ విమర్శలు చేశారు.

also read:కడుపైనా చేయాలంటాడు: బాలయ్యపై జగన్, "పవన్ లోబరుచుకుని వదిలేస్తాడు"

 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు అనేక హామీలు ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను  నెరవేర్చలేదన్నారు.నేతన్నలకు ఇచ్చిన ఒక్క హామీని కూడ చంద్రబాబు అమలు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికలకు ముందు  ఇచ్చిన  హామీలను  అమలు చేసిందన్నారు.  నేతన్నలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.  టీడీపీ హాయంలో నేతన్నల కోసం  రూ. 550 కోట్లు ఖర్చు చేసిందని  ఆయన గుర్తు చేశారు.  సంస్కారం  ఉన్నవారెవరైనా  వాలంటీర్లను అవమానించరని  సీఎం జగన్ చెప్పారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొందరు విమర్శిస్తున్నారని  జగన్  విపక్షాలపై మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios