Asianet News TeluguAsianet News Telugu

AP Assembly Elections 2024: వైకాపా అభ్య‌ర్థుల్లో బీసీల‌కు పెద్ద‌పీట‌..

Andhra Pradesh Assembly Elections 2024: వైఎస్ఆర్సీపీ ఎన్నిక‌ల శంఖారావం పూర్తించింది. ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి..  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేశారు. 
 

AP Assembly Elections 2024: YSRCP candidates announced YS Jagan Mohan Reddy, who gave a big push to BCs RMA
Author
First Published Mar 16, 2024, 1:21 PM IST

Elections 2024:  వైఎస్ఆర్సీపీ ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మైంది. ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల విష‌యంలో సామాజిక వ‌ర్గాల ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని సీట్ల కేటాయింపులు చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి, త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌మాధిని సంద‌ర్శించి, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళులు ఆర్పించారు. ఆ త‌ర్వాత మీడియా స‌మావేశంలో వైకాపా నాయ‌కుడు ధ‌ర్మాన‌ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల స‌మ‌రం గురించి మాట్లాడారు. త‌మ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల విష‌యంలో అన్ని వ‌ర్గాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నామ‌ని చెప్పారు. 

సామాజిక న్యాయం పాటిస్తూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సీట్ల కేటాయింపులు చేశార‌ని తెలిపారు. ఇందులో బీసీలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట వేసిన‌ట్టు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకు 50 శాతం సీట్లు, అంటే మొత్తం లోక్ స‌భ‌, రాష్ట్ర అసెంబ్లీ సీట్ల కేటాయింపుల్లో 100 సీట్లు వీరికి కేటాయించారు. ఇందులో 84 ఎ‍మ్మెల్యేలు, 16 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 25 ఎంపీ సీట్లలో ఎస్సీలకు 4, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. అసెంబ్లీ సీట్ల‌లో బీసీల‌కు 48 సీట్లు కేటాయింపు. మొత్తంగా  లోక్ స‌భ‌, అసెంబ్లీ  200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. 

కావాల‌నే ఇరికించారు.. ఇది అక్ర‌మ అరెస్టు.. రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

 

 

PM MODI : దొంగ‌లు పోవాల‌నుకుంటే గ‌జ దొంగ‌లు వ‌చ్చారు.. ప్ర‌ధాని మోడీ

Follow Us:
Download App:
  • android
  • ios