Asianet News TeluguAsianet News Telugu

''ఏం చంద్రబాబు ... జగన్ క్రేజ్ చూసి ఫ్యూజులు ఔటయ్యాయా..!''

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజురోజుకు ప్రజల్లో క్రేజ్ పెరుగుతుంటే.... మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తగ్గుతోందని వైసిపి నాయకులు అంటున్నారు. అందుకు తాజా ఎన్నికల ప్రచారమే నిదర్శనమని చెబుతున్నారు.  

Andhra Pradesh CM YS Jaganmohan Reddy Craze in People AKP
Author
First Published May 9, 2024, 1:26 PM IST

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకుంది. మే 13న పోలింగ్ కాబట్టి మరో రెండుమూడు రోజులే ఏం చేసినా... ఒక్కసారి ఓటర్ తీర్పు ఈవిఎంలలో నిక్షిప్తం అయ్యిందో ఎవ్వరేం చేయలేరు. అందువల్లే పోలింగ్ కు ముందు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు మీడియా అత్యుత్తమ సాధనమని గుర్తించిన రాజకీయ పార్టీల అధినేతలు ఇంటర్వ్యూల బాట పట్టారు. ఇలా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి... మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు తదితరులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇలా మీడియాను తమ ఎన్నికల ప్రచారంకోసం ఉపయోగించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. 

అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టివి9 ఇంటర్వ్యూ చేసింది. ఇందులో సీఎం జగన్ చాలా విషయాలు గురించి మాట్లాడారు. మూడు రాజధానుల నుండి  పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వరకు ఆంధ్ర ప్రదేశ్ లో చర్చనీయాంశమైన ప్రతిదాని గురించి సీఎం మాట్లాడారు. ఇలా ఆసక్తికరంగా సాగిన ఆ ఇంటర్వ్యూ కోసం ప్రజలు టీవీలకు అతుక్కుపోయారని వైసిపి నాయకులు చెబుతున్నారు. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే, ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంటే, ఎంతగానో నచ్చిన సినిమా వస్తుంటే ఎలా చూస్తారో తమ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతుంటే అలా చూస్తుండిపోయారట. దీంతో ఇంటర్వ్యూ ప్రసార సమయంలో సదరు టీవి ఛానల్ వ్యూస్ అమాంతం పెరిగిపోయాయని వైసిపి నాయకులు చెబుతున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ లో కూడా ఈ ఇంటర్వ్యూ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వీడియోలు  సోషల్ మీడియా వైరల్ గా మారాయని వైసిపి నాయకులు చెబుతున్నారు. 

గత ఐదేళ్ల వైసిపి చేసిన అభివృద్ది, ప్రజలకు అందించిన సంక్షేమం గురించి వైఎస్ జగన్ వివరించారు.  అలాగే మళ్ళ అధికారంలోకి వచ్చాక రాబోయే ఐదేళ్లు ఎలా పాలించనున్నారో కూడా సీఎం తెలిపారు. ప్రజల్లో నెలకొన్న చాలా సందేహాలకు ఈ ఇంటర్వ్యూ ద్వారా జగన్ సమాధానం చెప్పారట. అసలు తన విజన్ ఏమిటి... పాలనా విధానం ఎలా వుంటుంది అన్నది స్పష్టంగా వివరించారు సీఎం జగన్. 

ఇక ఎన్నికల వేళ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సీఎం వివరించారు. భూరక్షణ కోసం తీసుకువచ్చిన చట్టంపై భూములు కాజేయడానికి తెచ్చారంటూ దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు జగన్ సరైన సమాధానం చెప్పారు. ఇక పవన్ కల్యాణ్ పై కూడా జగన్ పంచులు విసిరారు. 

అందులో అభివృద్ధి, సంక్షేమం...వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను టీవీ - 9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు.. భూ సర్వే గురించి...టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు... సంధించిన ప్రసంగాలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...రెండో సారి చేస్తే గ్రహపాటు.... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయని వైసిపి నాయకులు అంటున్నారు. 

ఇదే సమయంలో టిడిపి నేత చంద్రబాబు ఏబిఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదికూడా వైఎస్ జగన్ ఇంటర్వ్యూతో పాటే ప్రసారం అయినా అట్టర్ ప్లాప్ అయ్యిందని అంటున్నారు. ప్రజలు అటుంచి కనీసం టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా చంద్రబాబు ఇంటర్వ్యూ చూడలేదని అంటున్నారు. బాబు గాలిమాటల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టే ఆయన ఇంటర్వ్యూ చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని... దీంతో అటు ఛానల్ లోనూ, ఇటు యూట్యూబ్ లోనూ వ్యూస్ లేవన్నారు. చంద్రబాబు ఇంటర్వ్యూ చూసిన కొందరు కూడా గత ముప్పైఏళ్ళుగా చెప్పిన సోదే చెబుతూ చావగొడుతున్నాడ్రా బాబు అని విసుకున్నారని వైసిపి చెబుతోంది. 

వైఎస్ జగన్ ను ఒంటరిగా ఎదిరించలేక చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రధానీ మోదీని తెచ్చుకున్నారు... కానీ ఏం చేయలేకపోతున్నారని అంటున్నారు. విజయవాడలో మోదీ చెప్పటిన రోడ్ షో కంటే  జగన్ ఇంటర్వ్యూ చూసేందుకే ప్రజలు ఇష్టపడ్డారట. ఇది మా నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ అంటూ వైసిపి నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. దే ఈమేజ్ మరోసారి జగన్ ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే వెలువడుతున్నాయని అంటున్నారు. క్రేజ్ కా బాప్ మా జగనన్న అంటూ  వైసిపి కార్యకర్తలు అభిమానంతో ఊగిపోతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios