Asianet News TeluguAsianet News Telugu

'కూటమి'మేనిఫెస్టో అమలు సాధ్యమయ్యేనా..!? 

TDP-Janasena-BJP manifesto: ఆంధ్రప్రదేశ్ జరిగే ఎన్నికల నేపధ్యంలో టీడీపీ- జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ మేనిఫెస్టో అమలు సాధ్యాసాధ్యాలపైన రాజకీయ వర్గాల్లోనూ, ప్రజలలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

andhra pradesh assembly election 2024 Is TDP-Janasena-BJP manifesto implementation KRJ
Author
First Published May 1, 2024, 7:24 PM IST

TDP-Janasena-BJP manifesto: ఆంధ్రప్రదేశ్ జరిగే ఎన్నికల నేపధ్యంలో టీడీపీ- జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ మేనిఫెస్టో అమలు సాధ్యాసాధ్యాలపైన రాజకీయ వర్గాల్లోనూ, ప్రజలలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణ అసాధ్యమని అధికార వైసీపీ ఆరోపిస్తుంది. మొదటి నుంచీ చంద్రబాబు తీరే అంత అనీ, కంచం నిండా పెట్టినట్లు ప్రచారం చేస్తారని, చివరకు చేతిలో చిటికెడు దులిపేసి..ఇది ఇవ్వడమే ఎక్కువని తప్పించుకుంటారని విమర్శలు గుప్పిస్తోంది. గత ముప్పయ్యేళ్లుగా చంద్రబాబు వ్యవహారశైలిని చూసినవాళ్లకు ఇది స్పష్టంగా తెలుసుదనీ, అదే విషయం మ్యానిఫెస్టోలో కూడా స్పష్టమవుతుందని అధికార పార్టీ ఆరోపిస్తుంది. 

ఇక పెన్షన్ విషయానికి వస్తే.. ఏప్రిల్ నుంచి పింఛన్ 4000కి పెంచి ఏప్రిల్,మే, జూన్ 3 నెలల ఎరియర్స్ కలిపి (4000+1000+1000+1000= 7000)ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే.. జులై 1st న 65 లక్షల మందికి 7000 చొప్పున పింఛన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే జులైలో ఒక్క పింఛన్ కోసమే సుమారు రూ. 5000 కోట్లు కావాల్సి ఉంటుంది. వాస్తవానికి ..2018లో కేవలం 39 లక్షలకి మాత్రమే పించన్  అందేది. కానీ, ప్రస్తుతం 65 లక్షల మందికి పైగా పింఛన్ ఇస్తున్నారు. అంటే ఫించన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు డబుల్ అయింది. 2018 అక్టోబర్ లో పింఛన్ కోసం నెలకి 400 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం. ఫించన్ గనుక రూ. 4000కి పెంచితే నెలకు దాదాపు రూ.3000 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పులు మారిందనీ, రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారనే చంద్రబాబు.. ఇప్పుడు అంత డబ్బు ఎలా సమకూరుస్తారని అధికార ప్రశ్నిస్తుంది.  

ఇక వైసీపీ అమలు చేస్తున్న ’అమ్మఒడి’ పథకం స్థానంలో ’అమ్మకు వందనం’ అనే పథకాన్ని ప్రవేశపెడుతామని కూటమి తన మేనీఫెస్టోలో ప్రకటించింది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఇంటర్ వరకూ చదివే పిల్లలకు ఏటా రూ.15000 అమ్మఒడి కింద అందజేస్తున్నారు. దీనికి ఏటా 44.50 లక్షలమందికి రూ.26,067 కోట్లు అందజేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ’తల్లికి వందనం’ పేరిట ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికి ఏటా రూ. ఇరవై వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పథకాన్ని అమలు చేస్తే.. సుమారు 65 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐదేళ్ళలో రూ.52,000 కోట్లు ఖర్చవుతుంది. అలాగే.. కూటమి తన హామీలు అమలు చేయాలంటే.. ఏటా రూ. 121619 కోట్లు ఖర్చు అవుతుందని ఓ ప్రాథమిక అంచనా. ఇంతకీ అంత బడ్డెట్ ఉందా ? కూటమి అధికారంలోకి వస్తే.. ఆ పథకాలు అమలు సాధ్యమయ్యేనా.

Follow Us:
Download App:
  • android
  • ios