Tech News
స్పీడ్‌ఫాస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం యూఏఐ ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ కలిగి ఉంది. దుబాయ్‌లో సగటున ఇంటర్నెట్ వేగం 442 ఎమ్‌బీపీఎస్‌గా నమోదైంది.
ఈ జాబితాలో ఖతార్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 358 ఎమ్‌బీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తోంది.
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కలిగిఉన్న దేశాల్లో కువైట్ 3వ స్థానంలో ఉంది. ఇక్కడ 264 ఎమ్‌బీపీఎస్‌తో కూడిన ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.
ఈ జాబితాలో బల్గేరియా దేశం 4వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇంటర్నెట్ వేగం 172 ఎమ్‌బీపీఎస్‌గా ఉంది.
ఇక 5వ స్థానంలో డెన్మార్క్ దేశం ఉంది. ఈ దేశంలో యూజర్లు 162 ఎమ్‌బీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు.
హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా 6వ స్థానంలో ఉంది. ఇక్కడ 148 ఎమ్‌బీస్ వేగంతో కూడిన ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.
నెదర్లాండ్స్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దేశాల్లో 7వ స్థానంలో ఉంది. ఇక్కడ 147 ఎమ్‌బీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.
నార్వో దేశం 8వ స్థానంలో ఉంది. ఈ దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ 74 ఎమ్‌బీపీఎస్ వేగంతో అందిస్తున్నారు.
ఇక హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్న దేశాల్లో.. 139 ఎమ్‌బీపీఎస్‌తో చైనా 9వ స్థానంలో ఉండగా, 143 ఎమ్‌బీపీఎస్‌తో లక్సెంబర్గ్ 10వ స్థానంలో ఉంది.
సుమారు 90 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్న భారత దేశం హైస్పీడ్ ఇంటర్నెట్ విషయంలో మాత్రం 25వ స్థానంలో నిలిచింది.