రీసెంట్ గానే తన భార్య నటాషాతో విడిపోయిన హార్దిక్, మళ్లీ ప్రేమలో పడ్డాడట. జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం గమనార్హం.
కొత్త ప్రేమ ఎక్కడ పుట్టిందంటే..?
వీరిద్దరూ రీసెంట్ గా పూల్ సైడ్ ఫోటోలు దిగి షేర్ చేశారు. ఒకే ప్లేస్ లో ఫోటోలు దిగి, సింగిల్ గా షేర్ చేశారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.
జాస్మిన్ వాలియా బ్యాగ్రౌండ్
జాస్మిన్ వాలియా ఒక బ్రిటిష్ సింగర్. అంతేకాదు ఆమె నటనలో కూడా రాణించింది. టీవీలో కూడా కనిపించింది. ఆమె తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందినవారు.
సంగీత పరిశ్రమలో మంచి పేరు
ఎసెక్స్‌లో జన్మించిన జాస్మిన్ ఇప్పటికే అనేక పాటలు పాడింది. 2018లో 'సోను కే టీటూ కీ స్వీటీ' చిత్రంలోని 'బాంబ్ డిగి డిగి' పాటను రీమేక్ చేసింది.
రియాలిటీ టీవీ సిరీస్‌లో
చాలా బోల్డ్ పర్సనాలిటీ ఉన్న జాస్మిన్ బ్రిటిష్ రియాలిటీ టీవీ సిరీస్ (ది ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్)లో కనిపించింది. దీంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది.
తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది
జాస్మిన్ 2014లో తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. అక్కడ ఆమె ఇతర గాయకుల పాటలు పాడి తన ప్రతిభను ప్రదర్శించేది. 2017లో 'బాంబ్ డిగి'తో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది.
నటాషా కంటే తక్కువేమీ కాదు
స్టైల్, అందంలో జాస్మిన్ హార్దిక్ మాజీ భార్య నటాషా కంటే తక్కువేమీ కాదు. దుస్తుల నుండి మేకప్ వరకు ఆమె బోల్డ్ పర్సనాలిటీ కనిపిస్తుంది.