SPORTS
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆగస్టు 24న దేశవాళీ , అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శిఖర్ రిటైర్ అవుతున్నప్పటికీ, అతని ఫిట్‌నెస్ అభిమానులకు ఎంతో ఇష్టం.
శిఖర్ ధావన్ తనని తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌లో కార్డియో సెషన్‌లు చేస్తారు. వారానికి 2 కార్డియో సెషన్‌లు, వెయిట్ ట్రైనింగ్ తో ధావన్ తన ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తున్నారు.
శిఖర్ ధావన్ వారానికి 3 రోజులు జిమ్‌కు వెళ్లి కఠినమైన వ్యాయామం చేస్తారు. స్ట్రెచింగ్‌తో పాటు మొబిలిటీ శిక్షణ కూడా అతని వ్యాయామంలో ముఖ్యమైన భాగం.
శిఖర్ ధావన్ తనకి ఇష్టమైన ఆహారాన్ని తినకుండా ఉండలేరు. ఎక్కువ కేలరీలు తీసుకున్న తర్వాత, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు.
శిఖర్ ధావన్‌కు ఆలూ పరాఠాలు తినడం చాలా ఇష్టం. కానీ శిఖర్ వారాంతంలో మాత్రమే ఇష్టమైనవి తింటారు. అలాగే ప్రతిరోజూ ప్రోటీన్ షేక్ తాగుతారు.
శిఖర్ ధావన్ కార్బ్స్, ప్రోటీన్ , ఫైబర్ కోసం ప్రతిరోజూ తాజా పండ్లు తింటారు. ఇది అతని శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
శిఖర్ ధావన్ జిమ్‌తో పాటు యోగా ద్వారా కూడా ఫిట్‌గా ఉంటారు. ఎక్కువగా యోగాలోనూ సూర్య నమస్కారాలు చేయడాన్ని ఆయన ఇష్టపడతారు.