Special

మీరు ఎన్నడూ చూడని 10 వింత జంతువులు... వీటి ప్రత్యేకతలు తెలుసా?

Image credits: సోషల్ మీడియా

భారతీయ జెయింట్ స్క్విరల్

ఈ పెద్ద ఉడత అనేక రంగులు కలిగి ఉంటుంది. పశ్చిమ కనుమలలోని చెట్ల పై సంచరిస్తుంది. చాలా అరుదుగా కనిపించే ఈ పెద్ద ఉడుత దాని రూపానికి తగినట్లుగానే మిస్టీరియస్ గా ఉంటుంది.

Image credits: డైలీ మెయిల్

ఇండియన్ తోడేలు

భారతీయ తోడేలు పరిమాణంలో చిన్నది కానీ, వేటాడే సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ మాంసాహార జీవి తరచుగా రాత్రి వేళ చీకటిలో తిరుగుతుంది. మనుషులకు అరుదుగా కనిపిస్తుంది. 

Image credits: Pinterest

స్లాత్ బేర్

ఇది దాని విలక్షణమైన మూతి, సోమరితనానికి ప్రసిద్ధి చెందింది, ఇది రాత్రిపూట తిరిగే ఏకాంత జీవి. చెద పురుగులు స్లాత్ బేర్ ప్రధాన ఆహారం. 

Image credits: గెట్టి

హిమ చిరుతపులి

స్నో లెపార్డ్  పర్వతాలలో సంచరించే అత్యంత అరుదైన జీవి. దీని దట్టమైన బొచ్చు కఠినమైన చలిని తట్టుకోవడానికి సహాయపడుతుంది. 


 

Image credits: Pinterest

నల్ల లంగూర్

నల్ల లంగూర్..  నలుపు, బంగారు రంగు బొచ్చతో, దక్షిణ భారతదేశంలోని దట్టమైన అడవులలో నివసిస్తుంది. ఇది ఎత్తైన చెట్ల పైభాగంలో ఉంటుంది. 

Image credits: Pinterest

గంగా నది డాల్ఫిన్

గంగా నదిలో నివసించే డాల్ఫిన్లు గుడ్డివి. మంచినీటిలో మాత్రమే జీవించగలవు. ఇది అల్ట్రాసోనిక్ శబ్దాలను విడుదల చేయడం ద్వారా ఆహారం కోసం వెతుకుతుంది. 


 

Image credits: మాల్దీవులు

పాంగోలిన్

భారతీయ పాంగోలిన్ ప్రమాదంలో ఉన్నప్పుడు బంతిలా చుట్టుకుపోతుంది. ఇది రాత్రిపూట సంచరిస్తూ కీటకాలను తిని జీవిస్తుంది.  

Image credits: సోషల్ మీడియా

భారతీయ నెమలి

నెమలి భారత దేశ జాతీయ పక్షి.  ఇది గంభీరమైన రూపం, రంగురంగుల ఈకలకు ప్రసిద్ధి చెందింది. నాట్యం, అందం నెమలిని ప్రత్యేకంగా మార్చాయి. 

 

Image credits: సోషల్ మీడియా

ఘరియల్

ఘరియల్, పొడవైన సన్నని మూతి కలిగిన మొసలి. ఇది భారతదేశ నదులలో నివసిస్తుంది. ఈ జాతి అంతరించిపోయే దశలో ఉంది.చాలా అరుదుగా కనిపిస్తుంది. 

Image credits: సోషల్ మీడియా

క్లౌడెడ్ చిరుతపులి

క్లౌడెడ్ చిరుతపులి చర్మంపై మేఘాల మాదిరిగా ఉండే ఆకారాలను కలిగి ఉంటుంది. ఒంటరిగా జీవించడం, వేటాడటం దీని స్వభావం. క్లౌడెడ్ చిరుత సైతం చాలా అరుదుగా మనుషుల కంటపడుతుంది.

Image credits: సోషల్ మీడియా
Find Next One