Lifestyle

బంగారానికి ఎందుకు తుప్పు పట్టదు?

బంగారానికి తుప్పు ఎందుకు పట్టదు?

బంగారం ధరించడం ప్రతి స్త్రీ కల. భారతదేశంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసి ధరిస్తారు. కానీ బంగారానికి తుప్పు ఎందుకు పట్టదో ఎప్పుడైనా ఆలోచించారా?

రసాయన స్థిరత్వం

బంగారం రసాయనికంగా inert, అంటే అది ఆక్సిజన్, తేమతో చర్య జరపదు. ఇనుము వంటి ఇతర లోహాలు ఆక్సీకరణం చెందుతాయి, దీనివల్ల వాటికి తుప్పు పడుతుంది. 

ఎందుకు తుప్పు పట్టదు?

బంగారానికి తుప్పు పట్టదు ఎందుకంటే అది noble metal. అంటే బంగారం రసాయనికంగా చాలా స్థిరంగా ఉంటుంది. గాలి, నీరు లేదా ఇతర రసాయనాల దగ్గరకు వచ్చినా అంత తేలికగా చర్య జరపదు.

ఆక్సీకరణ లేకపోవడం

లోహాలు ఆక్సిజన్‌తో చర్య జరిపినప్పుడు ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది, దీనివల్ల తుప్పు పడుతుంది. బంగారం ఆక్సిజన్‌తో చర్య జరపదు, కాబట్టి పొర ఏర్పడదు.. తుప్పు కూడా పట్టదు.

తుప్పు నిరోధకత

బంగారం దాని అధిక తుప్పు నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. దీనికి ఆమ్లాలు, క్షారాలు లేదా ఇతర రసాయనాల వల్ల హాని జరగదు. ఇవి ఇతర లోహాలలో తుప్పుకు కారణమవుతాయి.

పరమాణు నిర్మాణం

బంగారం పరమాణు నిర్మాణం కూడా దానిని రసాయన చర్య నుండి దూరంగా ఉంచుతుంది. దాని ఎలక్ట్రాన్లు చాలా బలంగా బంధించబడి ఉంటాయి. అవి ఇతర మూలకాలతో సులభంగా చర్య జరపవు.

ఈ కారణాల వల్ల తుప్పు పట్టదు

ఈ లక్షణాల కారణంగానే బంగారం దాని మెరుపు, రూపాన్ని చాలా కాలం పాటు నిలుపుకుంటుంది. దానికి ఎప్పుడూ తుప్పు పట్టదు. ఈ కారణంగానే బంగారాన్ని ఆభరణాలు, నాణేల తయారీలో ఉపయోగిస్తారు.

ఎముకల ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు

ఈ విషయాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడతారు

పాలు తాగితే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

చర్మాన్ని మృదువుగా మార్చే ఆయిల్స్ ఇవి