Lifestyle

ఆపరేషన్ రూంలోకి డాక్టర్లు గ్రీన్ కలర్ దుస్తులనే ఎందుకు వేసుకెళ్తారు

డాక్టర్లు

సర్జరీ చేసే టైం లో డాక్టర్లు ఎప్పుడూ ఆకుపచ్చని లేదా నీలిరంగు దుస్తులనే వేసుకుంటుంటారు. ఇలా ఎందుకు వేసుకుంటారు? దీనికి శాస్త్రీయ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆపరేషన్లో ఆకుపచ్చని దుస్తుల వెనుక శాస్త్రం

ఆపరేషన్ చేసే టైంలో డాక్టర్లు పూర్తి దృష్టి కేంద్రీకరించాలి. అయితే గ్రీన్ కలర్ డాక్టర్ల దృష్టి, మానసిక ప్రశాంతత, పనితీరును మెరుగుపరుస్తుందని నమ్ముతారు.

ఆపరేషన్ లో కళ్లకు ఉపశమనం ఇచ్చే రంగు

ఆపరేషన్ లో డాక్టర్ల కళ్లు మొత్తం ఎర్రని రక్తంపైనే కేంద్రీకృతమై ఉంటాయి. కాబట్టి ఈ ఆకుపచ్చ రంగు వారి కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. ఆకుపచ్చ రంగు ఇది ఎరుపునకు వ్యతిరేకం.

గ్రీన్ కలర్

ఆపరేషన్ టైంలో గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకోవడం వల్ల రక్తం ఎరుపు, గ్రీన్ కలర్ ల కాంట్రాస్ట్ బాగా కనిపిస్తుంది. దీనివల్ల డాక్టర్లు చిన్న నరాలు, కణాలను బాగా గుర్తిస్తారు. 

గ్రీన్ కలర్ డ్రెస్

డాక్టర్లు ఎక్కువసేపు రెడ్ కలర్ ను చూస్తే వారి కళ్లలో ఎర్రని మచ్చలు కనిపిస్తాయి. గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకోవడం వల్ల ఈ ప్రభావం తగ్గుతుంది. 

గ్రీన్ కలర్ డ్రెస్

గ్రీన్ కలర్ మానసిక ప్రశాంతతనిస్తుంది. ఆపరేషన్ టైంలో ఈ రంగు సర్జన్‌ ను ప్రశాంతంగా, దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.

డాక్టర్ల దృష్టి, ఏకాగ్రత పెంచే ఆకుపచ్చ

ఆకుపచ్చ రంగు మెదడుకు విశ్రాంతినిస్తుంది. ఆపరేషన్ టైంలో డాక్టర్లు ఎక్కువసేపు దృష్టి కేంద్రీకరించాలి. ఈ కలర్ వారికి ఇందుకు సహాయపడుతుంది.

గ్రీన్ కలర్

ఆకుపచ్చ, నీలిరంగు డ్రెస్ లు ఆపరేషన్ టైంలో పరిశుభ్రతకు చిహ్నంగా కూడా ధరిస్తారు. ఇది పేషెంట్, సిబ్బంది మధ్య నమ్మకాన్ని కలిగిస్తుంది.

తెల్లని దుస్తుల కంటే ఆకుపచ్చని దుస్తులు మేలు

ఆపరేషన్ థియేటర్‌లో వెలుతురు చాలా ఎక్కువగా ఉంటుంది. తెల్లని దుస్తులు ధరిస్తే వెలుతురు కళ్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆకుపచ్చ రంగు ఈ కాంతి ప్రభావాన్ని తగ్గిస్తుంది.

గ్రీన్ కలర్ డ్రెస్

ఆపరేషన్ టైంలో ఆకుపచ్చని డ్రెస్ ను వేసుకోవడం వల్ల ఆపరేషన్ బృంద సభ్యులు ఒకరి సంజ్ఞలను ఒకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు, దీనివల్ల సమన్వయం పెరుగుతుంది.

Find Next One