Lifestyle
అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కండరాలను రిలాక్స్ చేసి హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవన్నీ మీరు బాగా నిద్రపోయేలా చేస్తాయి.
చెర్రీ పండ్లలో మెలటోనిన్ మెండుగా ఉంటుంది. అయితే ఇది మనల్ని మరింత సౌకర్యవంతంగా, రిలాక్స్ గా ఉంచుతుంది. దీంతో మీరు తొందరగా నిద్రలోకి జారుకుంటారు.
పైనాపిల్ పండులో ఉండే విటమిన్ సి, మెలటోనిన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు మన నిద్రను ప్రత్యక్షంగా, పరోక్షంగా సానుకూలంగా ప్రభావితం చేస్తాయి
కివీల్లో విటమిన్ సి, సెరోటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తింటే కూడా మీరు ప్రశాంతంగా నిద్రపోతారు.
రాత్రిపూట విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లను తినడం వల్ల కూడా మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా పడుకుంటారు.
బొప్పాయిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు కూడా నిద్రను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. నిద్రపట్టాలంటే రాత్రిపూట కొద్దిగా ఈ పండును తినండి.
రాత్రిపూట తినడానికి బెస్ట్ స్నాక్స్ లో ఆపిల్ పండు ఒకటి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మనల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.