Lifestyle

రక్తపోటు

హైబీపీ యువతలో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. స్ట్రెస్, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం వంటి వాటివల్ల  బీపీ పెరుగుతుంది. 

Image credits: Getty

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. అయితే కొన్ని ఆహారాలు ఈ బీపీని పెరగకుండా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. అవేంటంటే? 

Image credits: Getty

బీపీ

పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు హై బీపీని తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
 

Image credits: our own

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలను తినడం వల్ల అధిక రక్తపోటు బాగా కంట్రోల్ అవుతుంది. 

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లి కూడా అధిక రక్తపోటును తగ్గించడానికి చాలా ఎఫెక్టీవ్ గా సహాయపడుతుంది. వీటిలో ఉండే నెట్రిక్ యాసిడ్ బీపీని బాగా తగ్గిస్తుంది. 
 

Image credits: Getty

పెరుగు

పెరుగు అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. 
 

Image credits: Getty

అరటి పండ్లు

అరటి పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. అరటిపండ్లను తింటే కూడా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
 

Image credits: Getty

ఓట్స్

ఓట్ మీల్ లో ఉండే గ్లూకాన్ బీపీని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మీ బరువును కూడా కంట్రోల్ చేస్తుంది. 

Image credits: Getty

కివి పండు

కివీ పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి బీపీని నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. 
 

Image credits: our own

నోటి పుండ్లు ఎందుకు అవుతాయో తెలుసా?

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తాగితే ఏయే లాభాలున్నాయో తెలుసా?

స్ట్రెస్ తగ్గాలంటే ఏం చేయాలి?

డయాబెటీస్ ను ఎలా గుర్తించాలి?