Lifestyle

డిఫరెంట్ ఎంగేజ్మెంట్ రింగ్స్ కావాలా, ఇవి మీకోసమే

క్లస్టర్ రింగ్

క్లస్టర్ రింగ్‌లో చిన్న చిన్న వజ్రాల సమూహం ఉంటుంది. ఈ ఉంగరం వధువు చేతులకు స్టైల్‌తో పాటు రాయల్ లుక్‌ని కూడా ఇస్తుంది.

బిగ్ సైడ్ డైమండ్ రింగ్

ఈ డైమండ్ రింగ్‌లో నాలుగు వైపులా చిన్న చిన్న వజ్రాలు పొదిగి ఉంటాయి. మధ్యలో పెద్ద సైజు వజ్రం ఉంటుంది. ఈ డైమండ్ రింగ్ చూసే వారందరినీ ఆకట్టుకుంటుంది.

హలో రింగ్

హలో రింగ్‌లో ప్రధాన వజ్రం చుట్టూ చిన్న వజ్రాల వృత్తం ఉంటుంది, ఇది రింగ్ సెంట్రల్ స్టోన్‌ను మరింత పెద్దదిగా , ప్రకాశవంతంగా చూపిస్తుంది. 

రోజ్ గోల్డ్ డైమండ్ రింగ్

రోజ్ గోల్డ్ ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉంది. దీని సాఫ్ట్ పింకిష్ టోన్ ఎవరికైనా నప్పేస్తుంది రోజ్ గోల్డ్ , డైమండ్‌తో తయారు చేసిన రింగ్ ట్రెండీ, రొమాంటిక్ లుక్‌ను ఇస్తుంది.

ఫ్లవర్ కట్ డైమండ్ రింగ్

బంగారంతో కూడిన ఫ్లవర్ కట్ డైమండ్ రింగ్ ఆధునిక , స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. బంగారు బ్యాండ్‌తో కూడిన ఈ డిజైన్ వధువు వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

ట్విస్టెడ్ గోల్డ్ బ్యాండ్ రింగ్

బంగారం  వజ్రాలతో తయారు చేసిన ఈ ట్విస్టెడ్ రింగ్ ఆధునిక, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. బంగారు బ్యాండ్‌లోని స్వల్ప ట్విస్ట్ ఇచ్చి డైమండ్ సెట్ చేయడం వల్ల రింగ్ కి డిఫరెంట్ లుక్ ఇస్తుంది.

గోల్డ్ ట్విస్ట్ రింగ్

మీ బడ్జెట్ వజ్రాలు కొనడానికి సరిపోకపోతే, మీరు మీ కాబోయే భార్య చేతికి ఇలాంటి బంగారు ఉంగరాన్ని తొడగవచ్చు. ట్విస్ట్ రింగ్ ట్రెండ్‌లో ఉంది. డైలీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది

లీఫ్ కట్ గోల్డ్ రింగ్

లీఫ్ కట్ గోల్డ్ రింగ్ కూడా వధువు చేతికి అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రకమైన ఉంగరం మీ వేళ్ల అందాన్ని ఎప్పటికీ పెంచుతుంది.

ఎటెర్నిటీ రింగ్

ఎటెర్నిటీ రింగ్‌లో బంగారు బ్యాండ్ చుట్టూ చిన్న చిన్న లీఫ్ డిజైన్లు ఉంటాయి. ఈ రకమైన ఉంగరం కూడా వధువుకు సరైన నిశ్చితార్థ ఉంగరం.

ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్

ప్రిన్సెస్ కట్ వజ్రాలు గుండ్రని లేదా చతురస్రాకార ఆకారానికి ప్రసిద్ధి చెందాయి. ఇది పదునైన అంచులను కలిగి ఉంటుంది. ఈ కట్ చాలా ఆధునిక , స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.

పెదాలు పగిలి ఇబ్బంది పెడుతున్నాయా?

ఈ చిట్కాలతో డయాబెటీస్ రిస్క్ తప్పినట్లే..!

పిల్లలకు అస్సలు పెట్టకూడని ఫుడ్స్ ఇవే

పాకిస్తానీతో కలిసి.. లండన్ ట్రిప్ లో సారా టెండుల్కర్