Lifestyle

భారత్‎లోని టాప్-10 ప్రసిద్ధ లడ్డూలు ఇవే

భారతదేశంలోని ప్రసిద్ధ లడ్డూలు

భారతీయ స్వీట్లు, తీపి పదర్థాల్లో లడ్డూలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. దేశంలోని టాప్10 ప్రసిద్ధ, రుచికరమైన లడ్డూల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. మోతీచూర్ లడ్డూలు

బూంది, నెయ్యితో తయారు చేసే ఈ లడ్డూలు పండుగలు, వివాహాలలో ప్రత్యేకంగా ఉంటాయి.

2. గోండ్ లడ్డూలు

గోండ్, డ్రై ఫ్రూట్స్, నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలు శీతాకాలంలో చాలా మందికి ఎంతో ఇష్టమైనవి. అలాగే, ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

3. కొబ్బరి లడ్డూలు

కొబ్బరి, కండెన్స్డ్ పాలతో తయారు చేసిన ఈ లడ్డూలు రుచికరమైనవి, చాలా ప్రసిద్ధి చెందినవి.

4. నువ్వుల లడ్డూలు

నువ్వులు, బెల్లం కలయికతో తయారు చేసిన ఈ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మంచివి.

5. బేసన్ లడ్డూలు

శనగపిండి, నెయ్యి, పంచదారతో తయారుచేసిన ఈ లడ్డూలు చాలా రుచితో ఉంటాయి. 

6. మగాజ్ లడ్డూలు

ఖర్బూజా గింజలు (మగాజ్) లడ్డూలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. ఉత్తర భారతంలో వేడుకలలో తప్పకుండా కనిపిస్తుంటాయి. 

7. రాజ్‌గిరా లడ్డూలు

భారతీయ గృహాలలో ఏకాదశి ఉపవాసాలు, ఇతర పండుగలలో రాజ్‌గిరా లడ్డూలను తీపి వంటకాలుగా తీసుకుంటారు.

8. చుర్మా లడ్డూలు

చుర్మా లడ్డూ రాజస్థాన్‌కు చెందిన ప్రసిద్ధ లడ్డూ. ఇది నెయ్యి, రోటీ లేదా బాతి చుర్మా నుండి తయారు చేస్తారు.

9. రవ్వ లడ్డూలు

ప్రతి భారతీయ గృహంలో సాధారణ రోజుల్లో కూడా కనిపించే ఈ రవ్వ లడ్డూ చాలా రుచిని కలిగి ఉంటుంది. 

10. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు

శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి డ్రై ఫ్రూట్స్ లడ్డూలను ఎంతో ఉపయోగంగా ఉంటాయి. వీటిని సాధారణంగా శీతాకాలంలో తయారు చేస్తారు.

భార్యాభర్తలు ఈ 5 విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు

ఇలా చేస్తే మసాలా దినుసులకు పురుగులు పట్టవు

ఇదే మంచి నెయ్యి

మిమ్మ‌ల్ని షాక్ తో పాటు ఆశ్చర్యపరిచే తిరుపతి లడ్డు టాప్-10 నిజాలు