Lifestyle

ఫ్రిజ్ లో పెట్టకూడనివి ఇవి

Image credits: Getty

బ్రెడ్

బ్రెడ్ ను ఎప్పుడూ కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ లో పెడితే బ్రెడ్ పై పసుపు, ఆకుపచ్చ ఫంగస్ ఏర్పడుతుంది. దీంతో అది చెడిపోతుంది.
 

Image credits: Freepik

అరటి పండ్లు

అరటి పండ్లను కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఇవి తొందరగా పాడవుతాయి. అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం చల్లని వాతావరణంలో ఉంచకూడదు. 
 

Image credits: Getty

కాఫీ పౌడర్

అవును కాఫీ పొడిని కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే దీని రుచి మారుతుంది. కాబట్టి కాఫీ పౌడర్ ను ఎప్పుడూ కూడా వంటగదిలో ఒక కంటైనర్ లో పెట్టండి. 
 

Image credits: Getty

నూనె

ఫ్రిజ్ లో కొబ్బరి నూనె, వంట నూనె,  నెయ్యి వంటి నూనెలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఇవి ఫ్రిజ్ లో పెడితే అవి తొందరగా పాడవుతాయి. 
 

Image credits: freepik

మసాలా దినుసులు

చాలా మంది ఉప్పు, గరం మసాలా, పసుపు వంటి మసాలా దినుసులను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు.  
 

Image credits: Getty

అవొకాడో

అవొకాడో మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. కానీ దీన్ని  ఫ్రిజ్ లో పెడితే త్వరగా పండదు. కాబట్టి దీన్ని ఫ్రిజ్ లో ఉంచకూడదు. 
 

Image credits: Getty

జీడిపప్పు, ద్రాక్ష

జీడిపప్పు, ఎండుద్రాక్ష లేదా ఇతర డ్రై ఫ్రూట్స్ ను ఫ్రిజ్ మాత్రం వెల్లకూడదు. ఒకవేళ పెడితే వాటి రుచి మారుతుంది. 
 

Image credits: Getty

కొన్ని కూరగాయలు

వెల్లుల్లి, ఉల్లిపాయ, బంగాళాదుంపలు, టమాటాలు మొదలైన వాటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే అవి తొందరగా కుళ్లి పోతాయి. 

Image credits: freepik

పరిగడుపున నానబెట్టిన ఖర్జూరాలను తింటే ఏమౌతుందో తెలుసా?

ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇలా చేయండి

ఇమ్యూనిటీ పవర్ ను పెంచే డ్రింక్స్ ఇవి..!

పచ్చ కామెర్లు వచ్చాయని ఎలా గుర్తించాలి?