Lifestyle
పల్లీల్లో మాంగనీస్, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బోలు వ్యాధి రాకుండా చేస్తాయి.
కంటి ఆరోగ్యానికి కూడా పల్లీలు బాగా ఉపయోగపడతాయి. శరీరానికి అవసరమైన విటమిన్ ఏని పల్లీలు అందిస్తాయి. రేచీకటి ఉన్న వారికి పల్లీలు ఎంతో ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు దరిచేరవు.
పల్లీల్లో ఉండే ఉండే ట్రిప్టోఫాన్.. శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యం పల్లీలతో పదిలంగా ఉంటుంది. చర్మంపై వచ్చే ముడతలను తగ్గించడంలో పల్లీలు ఉపయోగపడతాయి. చర్మానికి కాంతిని అందిస్తాయి.
పంటి సంబంధిత సమస్యలు సైతం పల్లీలతో దూరమవుతాయి. పచ్చి పల్లిల్లో కొద్దిగా ఉప్పు కలుపుకొని తీసుకుంటే చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు పల్లీలు ఉపయోగపడతాయి. ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.