Lifestyle
1836లో డానిష్ కు చెందిన జంతు శాస్త్రవేత్త థియోడోర్ ఎడ్వర్డ్ కాంటర్ కింగ్ కోబ్రాను ఒకే జాతిగా వర్గీకరించారు.
కానీ భారతీయ శాస్త్రవేత్తలు 12 ఏళ్ల పరిశోధన తర్వాత కింగ్ కోబ్రా ఒక్కటే కాదు. నాలుగు వేర్వేరు జాతులు అని కనిపెట్టారు.
చరిత్రలో నిలిచే ఈ విషయాన్ని కర్ణాటకలోని కళింగ సెంటర్ ఫర్ రెయిన్‌ఫారెస్ట్ ఎకాలజీ (అగుంబే)లో డాక్టర్ పి. గౌరీ శంకర్, అతని బృందం కలిసి కనిపెట్టారు.
1. ఉత్తర కింగ్ కోబ్రా (Ophiophagus hannah). ఇది ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, థాయిలాండ్‌లలో కనిపిస్తుంది. వాటి శరీరంపై 5-70 బ్యాండ్‌లు ఉంటాయి.
సుండా కింగ్ కోబ్రాలు ఇండోనేషియాలో కనిపిస్తాయి. ఈ పాముకు 70 కంటే ఎక్కువ బ్యాండ్‌లు ఉన్నాయి.
పశ్చిమ కనుమల కింగ్ కోబ్రా భారతదేశంలోని పశ్చిమ కనుమలలో కనిపిస్తుంది. దీని శరీరంపై తక్కువ బ్యాండ్‌లు ఉంటాయి.
లుజోన్ కింగ్ కోబ్రా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కనిపిస్తుంది. ఇది పూర్తిగా బ్యాండ్‌లు లేకుండా ఉంటుంది.
శాస్త్రవేత్తలు హిమాలయాలు, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుండి పాముల రంగులు, పొలుసులు వాటి DNAలను పరీక్షించారు.
బహుళ కింగ్ కోబ్రా జాతుల ఆవిష్కరణ పాముల సంరక్షణ, పర్యావరణ పరిశోధనలకు కీలకమని డాక్టర్ గౌరీ శంకర్ తెలిపారు.
కింగ్ కోబ్రాను నాలుగు వేర్వేరు జాతులుగా విభజించడం శాస్త్రీయ విజయం. ఈ విషయంతో ఈ పాము గురించి అవగాహనను పూర్తిగా మారిపోయింది.
భారతీయ శాస్త్రవేత్తలు పర్యావరణ సంరక్షణకు దోహదపడటమే కాకుండా ప్రపంచంలో ఊహాజనిత విషయాలపై నిజాలను ఆవిష్కరిస్తున్నారు.