Lifestyle

వైట్ షూస్ ను, చెప్పులను ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి

ఇంటి చిట్కాలు

 వైట్ చెప్పులు, షూట్ ను  ఒక్కసారి వాడినా.. పాతవాటిలా కనిపిస్తుంటాయి. కానీ కొన్ని చిట్కాలతో మాత్రం వీటిని చాలా రోజుల వరకు కొత్తవాటిలా కనిపించేలా చేయొచ్చు. అదెలాగంటే?

బ్లీచ్

వైట్ కాన్వాస్ బూట్లను ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఒక లీటర్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ బ్లీచ్ వేసి కలపండి. దీన్ని షూస్ ను అప్లై చేసి స్క్రబ్ చేయండి. తర్వాత తుడిచి ఆరబెట్టండి.

టాయిలెట్ పేపర్

టాయిలెట్ పేపర్ తో కూడా మీరు వైట్ షూస్ ను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఈ పేపర్ షీట్లను నీళ్లలో నానబెట్టి బూట్లకు అప్లై చేయండి. 12 గంటలు అలాగే ఉంచితే పూర్తిగా పోతాయి. 

నిమ్మకాయ

 నిమ్మరసం కలిపిని నీళ్లలో ఒక గడ్డను లేదా బ్రష్ ఉపయోగించి షూస్ కు అంటిని మరకలకు అప్లై చేసి బ్రష్ తో క్లీన్ చేయండి. తర్వాత బూట్లను ఎండలో ఉంచండి.

బేకింగ్ సోడా

 బేకింగ్ సోడా కూడా షూస్ కు అంటిన మరకలను ఈజీగా పోగొడుతుంది. 2 భాగాల బేకింగ్ సోడాలో 1 భాగం 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ పేస్ట్‌ను వేసి షూస్ ను క్లీన్ చేయండి. ఇది షూస్ ను తెల్లగా చేస్తుంది. 

మైల్డ్ లాండ్రీ డిటర్జెంట్

షూస్ తెల్లగా అవ్వాలంటే కొంచెం మైల్డ్ లాండ్రీ డిటర్జెంట్‌ను గోరువెచ్చని నీళ్లలో వేసి కలపండి. సబ్బు ద్రావణంలో వైట్ గుడ్ల లేదా పాత టూత్ బ్రష్‌ను ముంచి ప్రతి మరకను శుభ్రం చేయండి.

Find Next One