Lifestyle
అవును ఒత్తిడి నుంచి బయటపడాలంటేమాత్రం మీరు రాత్రిపూట బాగా నిద్రపోండి. కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
యోగా మనల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు రెగ్యులర్ గా యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
వ్యాయామం కూడా ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే శరీరం ఫిట్ గా ఉండటంతో పాటుగా మీరు మానసికంగా హెల్తీగా కూడా ఉంటారు.
హెల్తీ ఫుడ్ ను తింటే కూడా మీ ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఒత్తిడి నుంచి బయటపడటానికి మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఇది మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒత్తిడికి గురైనప్పుడు సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లను చూడకూడదు. అలాగే ఆల్కహాల్, సిగరేట్ కు కూడా దూరంగా ఉండాలి.
ఏం చేసినా ఒత్తిడి తగ్గలేదంటే మాత్రం.. సైకాలజిస్టును సంప్రదించడం కూడా మంచిది. దీనివల్ల మీరు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందుతారు.