Lifestyle
కూర చేయలకు ఉపయోగించే గుమ్మడికాయలు, పుచ్చకాయలు తినడం వల్ల వేడి తగ్గుతుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడమేకాకుండా పోషకాలను కూడా అందిస్తాయి. వేడిని తగ్గిస్తాయి.
కీరదోసకాయను ఎండాకాలంలో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ ను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే అత్యంత ప్రభావవంతమైన ఆహారాలలో ఆకుకూరలు ఒకటి. ఇవి మంచి పోషకాహారం.
వేడిని తట్టుకోవడానికి సాంప్రదాయకంగా ఎక్కువగా ఉపయోగించే పానీయం మజ్జిగ. ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా వేడి వల్ల కలిగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
వేడి వాతావరణంలో పెరుగును రెగ్యులర్ గా తినడం మంచిది. ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటుగా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది.
వేడిగా ఉన్నప్పుడు మాంసాహారం మంచిది కాదంటారు. అయితే చికెన్, మటన్ కు బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే చేపలను మీరు ఎండాకాలంలో తినొచ్చు.
అవొకాడో శరీరంలోని వేడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, శరీరం నుండి విషాన్ని బయటకు పంపడానికి బాగా పనిచేస్తుంది.