Lifestyle

ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌కి ఒకే బాయ్‌ఫ్రెండ్- రీల్ కాదు రియల్ లవ్ స్టోరీ

ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కు ఒక్కడే లవర్

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన ఓ వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్ గర్ల్ ఫ్రెండ్స్, ఒక బాయ్ ఫ్రెండ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

గోరఖ్ పూర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

గోరఖ్ పూర్ లోని షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఓ యువకుడిని ప్రేమించారు. ముగ్గురు కలిసి పారిపోయారు.

బీహార్ లో అరెస్ట్

బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మొబైల్, సీసీటీవీలను పరిశీలించి బీహార్ లోని గోపాల్ గంజ్ లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

లవర్ ను కలవడానికి వెళ్లి..

ముందు ఒక అమ్మాయి తన లవర్ ను కలవడానికి తోడుగా తన స్నేహితురాలిని తీసుకెళ్లింది. ఇదే క్రమంలో  చివరికి ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ముగ్గురు లవ్ స్టోరీ నడిపారు.

జీవితాంతం కలిసి ఉండాలనే కోరిక..

'మా ప్రేమ మూడేళ్లు. మేము ముగ్గురం జీవితాంతం కలిసి జీవించాలని కోరుకుంటున్నాం' అని వారు పోలీసులకు తెలిపారు.

హోటల్ కు వెళ్లలేదు

మొదట లక్నోకు చేరుకున్నామనీ, అక్కడి నుంచి బిహార్ కు వెళ్లామని చెప్పారు. ఆధార్ కార్డు చూపించాల్సి ఉన్నందున హోటల్లో బస చేయలేదని ఆ యువకుడు తెలిపాడు.

బంగారం ఎందుకు తుప్పు పట్టదు?

ఎముకల ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు

ఈ విషయాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడతారు

పాలు తాగితే బరువు పెరుగుతారా? తగ్గుతారా?