Lifestyle

ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేసే చిట్కాలు ఇవి

రంధ్రాలు మూయండి

ఇంట్లో  ఒక్క చిన్న రంధ్రం కూడా లేకుండా చేయండి. ఎందుకంటే ఎలుకలు రంధ్రాల్లోనే ఉంటాయి. అందుకే ఎక్కడైనా రంధ్రాలు ఉంటే మూసేయండి.

ఎలుకల బోనులు

ఇంట్లో ఎలుకలు లేకుండా చేయాలంటే ఎలుకల బోనులు ఖచ్చితంగా ఇంట్లో ఖచ్చితంగా వాడండి. బోనులో ఎలుకలు పడాలంటే చీజ్,  పీనట్ బటర్ లేదా చాక్లెట్ వంటి వాటిని పెట్టండి. 

నిమ్మకాయ, మిరియాల స్ప్రే

లెమన్ వాటర్ లో మిరియాల పొడిని కలిపి ఎలుకలు ఉన్న రంధ్రాల్లో స్ప్రే చేయండి. వీటి వాసన భరించలేక ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోతాయి. 

పుదీనా నూనె

పుదీనా నూనెతో కూడా ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేయొచ్చు. ఈ నూనె వాసన ఎలుకలకు నచ్చదు.   ఇందుకోసం పత్తికి పుదీనా నూనె రాసి ఇంటి మూలల్లో, ఎలుకలు వచ్చే చోట పెట్టండి.

బోరిక్ యాసిడ్, పిండి

పిండిలో బోరిక్ యాసిడ్ ను కలిపి ఎలుకలు తిరిగే ప్లేస్ లో పెట్టండి. దీనివల్ల అటు వైపు కూడా ఎలుకలు వచ్చే సాహసం చేయవు. 

అల్ట్రాసోనిక్ రిపెల్లెంట్స్

అల్ట్రాసోనిక్ రిపెల్లెంట్స్ ఎలుకలను ఇబ్బంది కలిగించే ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. దీనికోసం మీరు జస్ట్ ఇంట్లో ప్లగ్ చేసి ఉంచితే చాలు.

ఇల్లు శుభ్రంగా ఉంచాలి

 బొద్దింకలైనా, ఈగలైనా, ఎలుకలైనా ఇళ్లు మురికిగా, చెత్తగా ఉంటేనే వస్తాయి. కాబట్టి కిచెన్, ప్యాంట్రీ, తినే ప్రాంతాలను శుభ్రంగా, డ్రైగా ఉంచండి. 

Find Next One