Lifestyle
బస్సులు, ఆటోలు, కార్లు ఇలా ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. ట్రైన్ లల్లోనే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అందుే ఇండియన్ రైల్వే దేశ రవాణా వెన్నెముక అంటారు.
కొంచెం దూరం వెళ్లడానికి బస్సులే కంఫర్ట్ గా ఉంటాయి.కానీ లాంగ్ జర్నీకి మాత్రం ట్రైన్ లే చాలా బెస్ట్. చాలా దూరం బస్సులో ప్రయాణించడం చాలా కష్టం.
కొంతమందికి రైళ్లలో టికెట్ అవసరమే లేకుండా జర్నీ చేయొచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం.. 5 ఏండ్లలోపున్న పిల్లలకు టికెట్ అవసరం లేదు. అయితే వీళ్లకు సీటు కావాలంటే మాత్రం టికెట్ తీసుకోవాలి.
అవును ఈ ట్రైన్ లో మీరు టికెట్ లేకుండా ఫ్రీగా ప్రయాణించొచొచ్చు. భాక్రా-నంగల్ రైలులో టికెట్ తీసుకోకుండానే జర్నీ చేయొచ్చు. ఈ ట్రైన్ 75 ఏండ్ల నుంచి ప్రజలకు సేవ చేస్తోంది.
ఈ రైలు పంజాబ్‌లోని నంగల్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని భాక్రా వరకు 13 కిలోమీటర్లు వెళుతుంది.అయితే ఈ ట్రైన్ కేవలం 5 స్టేషన్లలోనే ఆగుతుంది.
ఇండియన్ రైల్వే ప్రతి ఏడాది ₹56,993 కోట్ల సబ్సిడీని ఎన్నో వర్గాల ప్రయాణికులకు అందిస్తుంది.అయితే కొన్ని టిక్కెట్లపై 46% తగ్గింపు కూడా అందిస్తోంది.