Lifestyle

రస్క్

సాధారణంగా చాలా మంది ఉదయాన్నే వేడి వేడి టీతో రస్క్ లను ఇష్టంగా తింటుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

Image credits: Getty

రస్క్

రస్క్ లు టేస్టీగా ఉన్నా వీటిని తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీ శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. వీటిని తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Image credits: Getty

డయాబెటిస్

దీనిలో కేలరీలు, చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి ఇవి అస్సలు మంచివి కావు. ఇవి బ్లడ్ షుగర్ ను పెంచుతాయి.
 

Image credits: Getty

గ్లూటెన్

రస్క్ లల్లో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గ్లూటెన్ అందరికీ సులువుగా జీర్ణం కాదు. దీనివల్ల ఉదర సంబంధ సమస్యలు వస్తాయి.
 

Image credits: Getty

జీర్ణవ్యవస్థ

రష్క్ లను రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం, పేలవమైన జీర్ణక్రియ, మలబద్ధకం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. 
 

Image credits: Getty

గుండెపోటు రిస్క్

రస్క్ రక్తపోటు, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. వీటిని రోజూ తింటే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం బాగా పెరుగుతుంది. 

Image credits: Getty
Find Next One