చాలా మందికి రాత్రిపూట లేట్ గా తినే అలవాటు ఉంటుంది. కానీ మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం తొందరగా తినాలి. అంటే మీరు పడుకోవడానికి రెండుమూడు గంటల ముందే తినాలి.
బరువు తగ్గాలనుకుంటే రాత్రిళ్లు ఎక్కువగా తినకండి. ఎక్కువగా తింటే మీరు బరువు తగ్గడం కష్టమవుతుంది. అలాగే తింటున్నప్పుడు ఫోన్, టీవీ చూడకూడదు. దీనివల్ల హెవీగా తినే ఛాన్స్ ఉంది.
రాత్రిపూట ప్రోటీన్లు తక్కువగా ఉండే వాటిని తినకూడదు. దీనివల్ల మీ ఆకలి పెరిగి, ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్ ను తింటారు. దీనివల్ల మీరు మరింత బరువు పెరుగుతారు.
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీరు బరువు బాగా పెరుగుతారు. అలాగే బ్లడ్ షుగర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మీ ఒంట్లో కొవ్వు బాగా పెరుగుతుంది. ఇలాంటి ఆహారాలను తినకూడదు.
వేపుళ్లు బలే టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తొందరగా జీర్ణం కూడా కావు. దీనివల్ల మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కాబట్టి ఉడికించిన ఆహారాలనే తినండి.
కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా ఫైబర్. ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అందుకే మీరు కూరగాయల్ని బాగా తినాలి.
బరువు తగ్గాలనుకుంటే మాత్రం రాత్రిపూట ఎట్టి పరిస్థితిలో టీ, కాఫీ, సోడా, జ్యూస్ వంటి షుగర్ ఉండే డ్రింక్స్ ను అస్సలు తాగకండి.
చాలా మంది రాత్రి భోజనం చేయడం మానేస్తే బరువు తగ్గుతారని అనుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మీరు రాత్రి తినకపోతే ఉదయం ఎక్కువ తింటారు. దీనివల్ల బరువు బాగా పెరుగుతారు.