Lifestyle

చాణక్య నీతి ప్రకారం.. వీటికి దూరంగా ఉండటమే మంచిది

ఈ 3 విషయాల గురించి జాగ్రత్త

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో.. మన జీవితానికి చాలా అవసరమైన మూడు విషయాల గురించి ఎంతో వివరంగా చెప్పాడు. చాలా దగ్గరగా, చాలా దూరంగా ఉండాల్సిన వాటి గురించి చెప్పాడు.

చాణక్య నీతి నుండి శ్లోకం

అత్యాసన్న వినాశాయ దూరస్థా న ఫలప్రదా:, సేవితవ్యం మధ్యాభాగేన రాజా బహిర్గురు: స్త్రియం:

శ్లోకం అర్థం

శ్లోకం అర్థం: అగ్ని, శక్తివంతమైన వ్యక్తులు, స్త్రీలకు చాలా దగ్గరగా లేదా చాలా దూరంగా ఉండకూడదు. ఈ మూడు విషయాల్లో చాలా సమతుల్యమైన విధానాన్ని పాటించడం అవసరమంటాడు చాణక్యుడు. 

అగ్నికి దగ్గరగా వెళ్లొద్దు

అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి చాలా దగ్గరగా లేదా చాలా దూరంగా ఉండటం మంచిది కావు. అందుకే చాణక్యుడు అగ్నికి సురక్షితమైన దూరం పాటించాలని అంటాడు.

శక్తివంతమైన వ్యక్తులతో

పవర్ ఫుల్ వ్యక్తులతో శత్రుత్వం లేదా స్నేహం అంత మంచిది కాదంటాడు చాణక్యుడు. చాణక్య నీతి ప్రకారం.. వీరితో సమతుల్యమైన విధానాన్ని పాటించాలి. 

స్త్రీలకు

ఆడవారితో ఎక్కువ సమయం గడిపితే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అలాగని వారికి పూర్తిగా దూరంగా ఉండటం కూడా మంచిది కాదంటాడు చాణక్యుడు. వీరితో కూడా సమతుల్యమైన విధానమే ఉత్తమమంటాడు.

Find Next One