Lifestyle

ఇలాంటి టైం లోనే ట్రూ ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది

అనారోగ్య సమయంలో..

చాణక్య నీతి ప్రకారం.. ఆరోగ్యం బాలేనప్పుడు మీతో ఉండి మీకు సహాయం చేసే వారు మీకు నిజమైన మిత్రులు. మీ శ్రేయోభిలాషి. 

దుఃఖంలో తోడుండేవాడు..

ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక సమయంలో బాధతో దు:ఖం వస్తుంది. ఇది చాలా సహజం. అయితే ఆచార్య చాణక్య ప్రకారం.. దుఃఖ సమయంలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు.

కరువు సమయంలో..

ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. అయితే మనకు కష్టం, కరువు వచ్చినప్పుడల్లా అంటే తినడానికి కూడా లేనప్పుడు అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడని ఆచార్య చాణక్యుడు అంటాడు. 

శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు..

మీ శత్రువుకు మీకు ఎదురుగా ఉన్నప్పుడు.. మీ స్నేహితుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయకుండా మీ వెంటే ఉండేవాడే ట్రూ ఫ్రెండ్. 

ప్రభుత్వ పనుల్లో

వ్యాజ్యం, కోర్టు కేసులు వంటి సమస్యల్లో మీరు చిక్కుకున్నప్పుడు.. మీ వెంటే ఉండి మిమ్మల్ని ఆదుకునే వారే మీ నిజమైన శ్రేయోభిలాషులు.

శ్మశానంలో తోడుండేవాడు

కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయకుండా ఆ సమయంలో మీ కోసం పనిచేసేవాడే నిజమైన స్నేహితుడని ఆచార్య చాణక్యుడు అంటాడు. 

ఇవి తింటే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది

మజ్జిగలో ఇవి కలిపి తాగితే.. ఉదయాన్నే కడుపు ఖాళీ అవుతుంది

మహిళలు మెచ్చే ట్రెండీ మంగళసూత్రం డిజైన్లు

మొటిమల సమస్యా? బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇది