Lifestyle

చాణక్య నీతి: ఈ విషయంలో మౌనంగా ఉండటమే ప్రమాదం

ఎప్పుడు మౌనం వీడాలి?

చాలా సందర్భాల్లో మౌనం మంచిదే కావచ్చు. కానీ.. కొన్ని సందర్భాల్లో మౌనం మూర్ఖత్వం కిందకు వస్తుందట. 

 

 

అన్యాయం ముందు మౌనంగా ఉండకండి

అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం తప్పని ఆచార్య చాణక్య అభిప్రాయపడ్డారు. అన్యాయాన్ని చూసి గొంతు విప్పడం మీ ధర్మం.

హక్కులు దూరమైతే మౌనంగా ఉండకండి

మీ హక్కులు దూరమవుతుంటే, మీరు మౌనంగా ఉంటే, అది మీ మూర్ఖత్వంగా పరిగణిస్తారు. హక్కుల కోసం భయం లేకుండా నిలబడాలి.

సత్యం కోసం మాట్లాడండి

సత్యానికి మద్దతు ఇవ్వడంలో ఎప్పుడూ వెనుకాడకూడదని చాణక్య చెప్పారు. సత్యం వైపు మాట్లాడటం మీ బాధ్యత.

మంచి సంబంధాలకు మాట్లాడటం ముఖ్యం

మంచి సంబంధాలకు సంభాషణ ముఖ్యం. సంబంధాల్లో నిజాయితనం, స్పష్టత కోసం మాట్లాడాలని చాణక్య చెప్పారు.

ధర్మాన్ని పాటిస్తూ మౌనం వీడండి

ధర్మం, అధర్మం విషయంలో ధర్మానికి మద్దతు ఇవ్వాలని చాణక్య చెప్పారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.

ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి

కొన్నిసార్లు జీవితంలో మౌనంగా ఉండటం సరిపోదు. ధైర్యంగా నిర్ణయం తీసుకుని మీ అభిప్రాయాన్ని చెప్పండి.

అవమానానికి ప్రతిఘటించండి

మిమ్మల్ని అవమానిస్తే సహించకూడదు. స్వగౌరవం కోసం నిలబడటం ముఖ్యమని చాణక్య చెప్పారు.

మీ లక్ష్యాల కోసం పోరాడండి

జీవితంలో లక్ష్యాల సాధనకు పోరాటం, దృఢత్వం అవసరం. మౌనంగా ఉండి అవకాశాలు కోల్పోవడం కంటే కష్టపడి మాట్లాడటం మేలు.

తప్పును సరిదిద్దడానికి మాట్లాడండి

తప్పును సరిదిద్దడానికి మాట్లాడటం, మీ అభిప్రాయాన్ని చెప్పడం సామాజిక బాధ్యత. బాధ్యతగల పౌరుడి లక్షణం ఇదేనని చాణక్య చెప్పారు.

సమాజ హితం కోసం మాట్లాడండి

సమాజ హితం కోసం సరైన సమయంలో సరైన విషయం చెప్పడం ముఖ్యమని చాణక్య భావించారు. సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ఇది కీలకం.

మటన్ లివర్ తింటే ఏమౌతుందో తెలుసా?

చేప నూనె దేనికి ఉపయోగపడుతుందో తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

గోర్లను కొరికితే ఏమౌతుందో తెలుసా

ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం మన భారత్ లోనే.. ఎక్కడుందో తెలుసా?