Lifestyle
చాణక్య నీతి ప్రకారం.. పెద్ద పెద్ద విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడకండి. అది వ్యక్తిగతమైనా, వ్యాపారమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.
మన జీవితంలో పెళ్లి అనేది అతి ముఖ్యమై నిర్ణయం. ఈ విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే తర్వాత మీరే బాధపడతారు.
చాలా మంది చేసే తప్పు ఇది. పూర్తి సమాచారం తెలుసుకున్నాకే పెట్టుబడి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి పెట్టుబడి పెడితే తర్వాత మీరు ఎంతో నష్టపోవచ్చు.
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం శాశ్వతమైనది. కాబట్టి ఈ విషయంలో మీరు తొందర పడి ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి స్నేహం చేస్తే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
కోపంలో ఏం మాట్లాడుతున్నామో తెలియదు. కానీ ఇలాంటి సందర్భంలో మాట్లాడితే సంబంధాలు తెగిపోతాయి. అందుకే చాణక్యుడు కోపం తగ్గిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడటం మంచిదంటాడు.
విద్యార్థులు తమ కెరీర్ విషయంలో కూడా తొందర పడకూడదు. తొందర పాటులో మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీకు ఎంతో బాధను కలిగిస్తుంది.
అప్పు ఇచ్చే ముందు కూడా వారి ఆర్థిక పరిస్థితేంటి, నిజాయితీ పరులేనా వంటి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే అప్పు ఇవ్వాలి. ఇవేవి తెలుసుకోకుండా మీరు అప్పు ఇస్తే నష్టపోతారు.
ఏ వ్యాపారమైనా సరే భాగస్వామ్యం చేసే ముందు మీ భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తొందరపడి ఏమీ తెలుసుకోకుండా భాగస్వామిని ఎంచుకోవడం ప్రమాదకరం.
ఆరోగ్యం విషయంలో కూడా అస్సలు తొందరపడకూడదు. ముఖ్యంగా చికిత్స, ఆపరేషన్ వంటి విషయాల్లో. వీటిలో డాక్టర్ల సలహా తీసుకోవడం చాలా అవసరం.
సంబంధాల విషయాల్లో కూడా మీరు తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే గొడవలు జరుగుతాయి.