Lifestyle

ఈ విషయాలను ఎవ్వరితోనూ చెప్పుకోకండి

మీ ప్లాన్స్

ఫ్యూచర్ లో మీరు చేసే పనుల గురించి, మీ ప్లాన్స్ గురించి ఇతరులకు అస్సలు చెప్పకూడదు. ఇది మీ విజయాన్ని ఆపేసే అవకాశముంది. 

మీ కష్టాలు ఎవరికీ చెప్పకండి

మన కష్టాలు ఎదుటి వారికి నవ్వులుగా ఉంటాయి. కష్టాలను ఇతరులు మన బలహీనతలుగా భావించి వారికి అనువుగా మార్చుకుంటారు. కాబట్టి వీటిని చెప్పకూడదు. 

ఆర్థిక స్థితి గురించి

చాలా మంది తమ ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెబుతుంటారు. కానీ దీనివల్ల ఇతరులు మీ నుంచి డబ్బును ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని చెప్పకూడదు.

కలలు, కోరికలు చెప్పకండి

 మనలో ప్రతి ఒక్కరికీ కోరికలు, కలలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే చాలా మంది కొంచెం క్లోజ్ గా ఉన్నా వాటిని టక్కున చెప్పేస్తుంటారు. కానీ ఇది మీకు నిరాశ కలిగిస్తుంది. 

సంబంధాల గురించి చెప్పకండి

ప్రేమ విషయాలైనా, ఫ్యామిలీ విషయాలైనా సరే వాటిని ఇతరులతో చర్చించడం మీ ఇమేజ్ ను దెబ్బతీస్తాయి. కాబట్టి వీటిని ఇతరులకు చెప్పకండి.

చెడు అనుభవాలు చెప్పకండి

ప్రతి ఒక్కరికీ చెడు అనుభవాలు ఉంటాయి. కానీ వీటిని ఇతరులకు చెబితే మీ మనోధైర్యం దెబ్బతింటుంది. ఇది మీ బలహీనతలను వారికి చెప్పనట్టే అవుతుంది. 

సీక్రెట్స్ చెప్పకండి

మీదైనా, వేరేవారిదైనా సరే ఇతరులకు సీక్రేట్స్ ను చెప్పడం మంచిది కాదు. ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. 

ఆఫీస్ సీక్రెట్స్ చెప్పకండి

ఆఫీస్ సీక్రేట్స్ లేదా మీ సహోద్యోగుల గురించి కూడ ఎవరితోనూ చెప్పకండి. ఇది మీ ప్రొఫెషనల్ ఇమేజ్‌ని దెబ్బతీస్తుంది.

మీ సంతోషాలు అందరితో పంచుకోకండి

కొన్ని కొన్ని సార్లు సంతోషాలను కూడా ఎవ్వరితోనూ పంచుకోకూడదంటారు చాణక్యుడు. ఎందుకంటే మీ సంతోషాలు అవతలి వారు అసూయపడేలా చేస్తాయి. దీంతో వారు మీతో పోటీ పడతారు.

హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ చెప్పకండి

హెల్త్ ప్రాబ్లమ్స్ ను కూడా ఇతరులతో చెప్పకూడదు. వారు మీపై జాలి చూపించినా, మిమ్మల్ని బలహీనంగానే భావిస్తారు.

చాణక్య నీతి పాటిస్తే సక్సెస్

చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను ఎవ్వరికీ చెప్పకుండా ఉంటే మీరు జీవితంలో మంచి విజయం సాధిస్తారు. 

వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలా?

వెల్లుల్లిని ఇలా తింటే మీరు బరువు తగ్గడం పక్కా

చియా సీడ్స్ నిజంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుందా?

గ్యాస్ సిలిండర్ లీకేజీని నీళ్లతో ఆపవచ్చా? LPG Gas సేఫ్టీ టిప్స్ మీకోసం