Lifestyle

ఉదయం పరిగడుపున తమలపాకును తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

భోజనం చేయడానికి ముందు తమలపాకు నమిలితే మన కడుపులో రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.దీంతో కడుపునకు సంబంధించిన సమస్యలు రావు.

Image credits: Getty

శక్తివంతంగా

పరిగడుపున తమలపాకును నమలడం వల్ల మీ శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పోతాయి. దీంతో మీరు శక్తివంతంగా, ఎనర్జిటిక్ గా ఉంటారు. 

Image credits: Freepik

సహజ శుద్ధి

మీకు తెలుసా? తమలపాకులో శుద్ధి చేసే లక్షణాలు ఉంటాయి. ఇది శ్లేష్మాన్ని తొలగించి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఇది మన ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty

నోటి శుభ్రత

పరిగడుపున తమలపాకును నమిలితే నోట్లోని చెడు బ్యాక్టీరియాను చనిపోయి తాజా శ్వాస వస్తుంది. ఇది నోటిని ఆరోగ్యంగా ఉంచుతుందని నిరూపించబడింది.

Image credits: social media

రోగనిరోధక శక్తి

తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, సీజనల్, ఇతర జబ్బులకు దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: social media

రక్తంలో చక్కెర

జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారంజ.. తమలపాకు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే కొన్ని సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

Image credits: Getty

సహజ ఆరోగ్యం

మన ఆరోగ్యం బేషుగ్గా ఉండటానికి మీరు ఈ ఆకుతో రోజును ప్రారంభించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత సలహా కోసం ఖచ్చితంగా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.

Image credits: social media

రాత్రిపూట బ్లడ్ షుగర్ పెరిగితే ఏమౌతుందో తెలుసా

ఇలా చేస్తే దుప్పట్లను ఉతకకున్నా.. శుభ్రంగా ఉంటాయి

మహిళల్లో కొలిస్ట్రాల్ తగ్గించే ఆహారాలు

దానిమ్మ పండు రోజూ తింటే జరిగేది ఇదే