Lifestyle
స్టీల్, ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా.. మీరు అరటి ఆకుల్లో భోజనం చేస్తే బోలెడు ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే?
వేడి వేడి ఆహారాన్ని అరటి ఆకుల్లో వేసినప్పుడు ఆ వేడికి ఆకులోని పోషకాలు ఆహారంలోకి చేరుతాయి. ఇది తిన్న మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అరటి ఆకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.
అరటి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు, చర్మ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి.
అరటి ఆకుల్లో తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
అరటి ఆకుల్లోని సమ్మేళనాలు గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా అడ్డుకుంటాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో అరటి ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
చర్మానికి పోషణనిచ్చే విటమిన్ సి, విటమిన్ ఎ వంటివి అరటి ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడై ముడతలు తగ్గిస్తుంది.