Lifestyle

బెడ్ టీ తాగితే ఏమౌతుందో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు

యాసిడ్ ,గ్యాస్ సమస్యలు

ఉదయాన్నే పరిగడుపున బెడ్ టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే కడుపులో గ్యాస్, మంట, నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. 

జీర్ణ వ్యవస్థపై ప్రభావం

పరిగడుపున టీ తాగితే మీ జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కెఫీన్, టానిన్లు కడుపు లోపలి పొరపై ఎఫెక్ట్ పడి వాంతులు, అజీర్ణం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. 

ఆకలి తగ్గిపోతుంది

అవును ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే మీకు ఆకలి తగ్గుతుంది. దీనివల్ల మీరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయలేరు. దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

ఒత్తిడి, చిరాకు

టీలో ఉండే కెఫీన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి, చిరాకు కలుగుతాయి. ఉదయం పరిగడుపున  కెఫీన్ ను తీసుకోవడం వల్ల మీ మానసిక స్థితి దెబ్బతింటుంది. 

డిహైడ్రేషన్

టీలో ఉండే కెఫీన్ వల్ల తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇది మీ శరీరంలోని నీటిని ఎక్కువగా బయటకు పంపుతుంది. దీంతో మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. 

పొట్టలో పుండ్లు

పరిగడుపున టీని ఎక్కువ కాలం తాగితే పొట్టలో పుండ్లు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి టీ తాగడానికి ముందు ఏదైనా తినండి. లేదా టీతో పాటు బిస్కెట్ ను తినండి.

Find Next One