Lifestyle

దెయ్యాలను చూసే ధైర్యం మీకు ఉందా: అయితే ఇక్కడకు వెళ్లండి

Image credits: our own

భన్గఢ్ కోట, రాజస్థాన్

సూర్యాస్తమయం తర్వాత భారత పురావస్తు శాఖ కూడా ఈ ప్రదేశంలోకి ప్రవేశించకూడదని నిషేధం ఉంది. అంత భయానక ప్రదేశం ఇది.  

Image credits: our own

కుల్ధారా గ్రామం, రాజస్థాన్

1825 నుండి ఈ గ్రామంలో చాలా మంది అదృశ్యమయ్యారట. అతీంద్రియ సంఘటనలు జరుగుతున్నాయనే భయంతో ఈ ఊరిలోకి ప్రజలు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు.
 

Image credits: our own

డౌ హిల్, కుర్సియోంగ్, పశ్చిమ బెంగాల్

డార్జిలింగ్‌లోని కుర్సియోంగ్‌లో ఉన్న విక్టోరియా బాయ్స్ హైస్కూల్, డౌ హిల్ గర్ల్స్ స్కూల్ భూతాలకు నివాస స్థలమని అక్కడ ప్రజలు నమ్ముతారు. 

Image credits: our own

డుమాస్ బీచ్, గుజరాత్

గుజరాత్‌లోని డుమాస్ బీచ్‌లోని నల్ల ఇసుక చాలా సంవత్సరాలుగా అనేక రహస్యాలతో ముడిపడి ఉంది. ఇక్కడ రాత్రిపూట భూతాలు తిరుగుతాయని చెబుతారు.

Image credits: our own

జతింగా, అస్సాం

ఇక్కడ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అమావాస్య రోజు రాత్రిళ్లు పక్షులు ఒక ప్రత్యేక ప్రదేశంలో నేలపై పడి చనిపోతాయి. ఈ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.

Image credits: our own

లంబి దేహార్ గనులు

ఒకప్పుడు సున్నపురాయి గని అయిన ఈ ప్రదేశంలో అక్కడ మరణించిన కార్మికుల ఆత్మలు తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతారు. రాత్రిపూట అరుపులు, విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి.

Image credits: our own

అగ్రసేన్ కి బావోలి, ఢిల్లీ

ఇది ఒక కళాత్మక ప్రదేశం. అయితే ఇక్కడ నీడ పడే ప్రాంతంలో భూతాలు, దయ్యాలు ఉన్నాయని  స్థానికులు నమ్ముతారు. 

Image credits: our own

డిసౌజా చాల్, ముంబై

ఈ ప్రదేశంలో ఒక స్త్రీ ఆత్మ తిరుగుతుందని చెబుతారు. రాత్రిపూట ప్రజలను వెంబడిస్తుందని, సూర్యోదయం తర్వాత మాయమవుతుందని ప్రజలు నమ్ముతారు.

Image credits: our own
Find Next One