టాపర్లు చదువును చివరి నిమిషం వరకూ వాయిదా వేయరు. ముందుగానే చదవడం మొదలుపెడతారు. దీంతో ప్రశాంతంగా అన్నీ అర్థం చేసుకుంటారు. పరీక్షలకు టెన్షన్ ఉండదు.
టాపర్లు క్లాసులు మిస్ అవ్వరు. టీచర్లు చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా నోట్ చేసుకుంటారు. బోరింగ్ లెక్చర్ అయినా వింటారు.
టాపర్లు కేవలం కంఠస్తం చేయరు. లోతుగా అర్థం చేసుకుంటారు. ఎలా, ఎందుకు అనేది ఆలోచిస్తారు. దీంతో పరీక్షల్లో బాగా రాణిస్తారు.
టాపర్లు కేవలం నోట్స్ చదవడంతో సరిపెట్టుకోరు. సారాంశాలు రాస్తారు, ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తారు, ఇతరులకు వివరిస్తారు. దీంతో బాగా గుర్తుంటుంది.
తక్కువ సమయంలో ఎక్కువ చదవాల్సి వస్తే, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో టాపర్లకు తెలుసు. కష్టమైన లేదా ముఖ్యమైన అంశాలను ఎక్కువ శక్తి ఉన్నప్పుడు చదువుతారు.
క్లీన్ గా ఉన్న చదువు స్థలం చూడటానికి బాగుంటుంది, చదువులో సమర్ధతను పెంచుతుంది. టాపర్లు నోట్స్, పుస్తకాలు, అసైన్మెంట్లను నీట్ గా ఉంచుకుంటారు.
కచ్చితమైన రొటీన్ చాలా ముఖ్యం. టాపర్లు ఎప్పుడు పడితే అప్పుడు చదవరు. షెడ్యూల్ పాటిస్తారు. దీంతో క్రమశిక్షణగా ఉంటారు, వాయిదా వేయరు.
టాపర్లు నిరంతరం చదవడం మంచిది కాదని తెలుసు. పోమోడోరో టెక్నిక్ వాడతారు - 25 నిమిషాలు చదువు, 5 నిమిషాలు బ్రేక్. దీంతో ఏకాగ్రతగా ఉంటారు.
మెంతులతో జాగ్రత్త !
సాధువులు ధరించే కాషాయ వస్త్రాల వెనుక అంత విషయం ఉందా?
రాత్రిపూట పరాట తినొచ్చా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ టెక్నిక్స్ పాటిస్తే ఇంటర్వ్యూలో సక్సెస్: జాబ్ మీదే