Lifestyle

ఇలా చేస్తే.. తొందరగా ముసలివాళ్లు అయిపోతారు

చెడు అలవాట్లు

కొంతమంది సెలబ్రిటీలు తెరముందు చాలా యంగ్ గా కనిపించినా.. తెరవెనుక మాత్రం వయసు అయిపోయిన వారిలా కనిపిస్తుంటారు. దీనికి కారణమేంటో తెలుసా? 

సిగరేట్

సిగరేట్ తాగడం వల్ల క్యాన్సరే కాదు.. తొందరగా ముసలివాళ్లూ అవుతారు. దీనివల్ల చర్మం వదులుగా అయ్యి అకాల వృద్ధాప్యం వస్తుంది. ఒక సిగరెట్ 11 నిమిషాల జీవితకాలాన్ని తగ్గిస్తుంది. 

నిద్రలేకపోవడం

ప్రతిరోజూ సరిగ్గా నిద్రపోని వారు తమ వయసు కంటె 10 సంవత్సరాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తారని అధ్యయనాలు చెబుతున్నారు. మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవాలి.

మద్యం

మందును ఎక్కువగా తాగే వారి శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది. దీంతో ముఖంపై ముడతలు, మొటిమలు, డ్రై స్కిన్, రోసేసియా వంటి సమస్యలతో చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. 

వ్యాయామం చేయకపోవడం

రోజూ వ్యాయామం చేస్తే మీ శరీరం బలంగా, ఫిట్ గా ఉంటుంది. మీరు వ్యాయామం చేయకపోతే త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధుల వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ స్క్రీన్ టైం

నేటి కాలంలో చాలామంది స్క్రీన్ ముందు గంటలకు గంటలు గడుపుతున్నారు. కానీ దీనివల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి చర్మంపై ముడతలు ఏర్పడతాయి. 

ఎండలో ఎక్కువసేపు ఉండటం

ఎండ వల్ల కూడా చిన్న వయసైనా పెద్దవారిలా కనిపిస్తాం. ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ముడతలు ఏర్పడతాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ ఖచ్చితంగా రాసుకోండి. 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టాప్-6 భారతీయ చిత్రకారులు ఎవరో తెలుసా?

విటమిన్ డి తక్కువగా ఉన్నవారు ఏం తినాలి

పిల్లల ముందు పేరెంట్స్ గొడవపడితే ఏమౌతుంది?

ఉపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు ఇవి