Lifestyle

ఇంట్లో తయారుచేసిన పచ్చళ్లను తింటే ఏమౌతుందో తెలుసా

పచ్చళ్ల

చాలా మంది డైట్ ను ఫాలో అయ్యేవారు పికిల్స్ ను మొత్తమే తినరు. కానీ తక్కువ పరిమాణంలో వీటిని తింటే శరీరానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 

పోషకాలతో నిండిన పచ్చళ్లు

తక్కువ నూనె,  మసాలా దినుసులతో ఇంట్లో తయారుచేసిన పచ్చళ్లలో  భాస్వరం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పోషకాలు ఉంటాయి.

గట్ హెల్త్ కి మంచిది

పచ్చళ్లని వెనిగర్, నూనెలో ఎక్కువసేపు నానబెడతారు. దీని వల్ల వాటికి పులియబెట్టిన ఆహార గుణాలు వస్తాయి. గట్ హెల్త్ కి పులియబెట్టిన ఆహారాలు మంచివి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పికిల్స్ లో ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపడుతుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

కొంచెం పచ్చడిని తినడం వల్ల త్వరగా ఆకలి తీరుతుంది. దీని వల్ల మళ్ళీ మళ్ళీ ఆకలి వేయదు. దీని కారణంగా ఇన్సులిన్ స్పైక్ తగ్గుతుంది. అంతేకాకుండా శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

కణాలను రక్షిస్తుంది

ఫ్రీ రాడికల్స్ శరీర కణాలను దెబ్బతీస్తాయి. పచ్చళ్లలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి, దీని కారణంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి.

కండరాల నొప్పుల నుండి ఉపశమనం

కొంతమంది అథ్లెట్లు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి పచ్చళ్ల రసం తాగుతారు. ఇది ఎలక్ట్రోలైట్ లోపాన్ని తీర్చగలదు. 

Find Next One