Lifestyle
బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు పోసి పేస్టులాగా చేసి.. టీ, పసుపు మరకలపై రాసి 20 నిమిషాల తర్వాత రుద్దితే ఆ మరకలు పోతాయి.
వెనిగర్, డిటర్జెంట్ సమపాళ్లలో కలిపి మరకలపై రాసి కొంతసేపు ఉంచి, గోరువెచ్చని నీళ్లతో ఉతకాలి.
మరకలపై నిమ్మరసం రాసి, కొంచెం ఉప్పు చల్లి, రుద్ది 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఉతకాలి. నిమ్మ, ఉప్పులోని ఆమ్ల గుణాలు మరకలను తొలగిస్తాయి.
హైడ్రోజన్ పెరాక్సైడ్ (3%) ను మరకలపై నేరుగా రాసి కొన్ని నిమిషాలు ఉంచి, చల్లటి నీళ్లతో ఉతకాలి.
తెల్లటి దుస్తులకు కొంచెం బ్లీచింగ్ పౌడర్ నీళ్లలో కలిపి, ఆ ద్రావణంలో దుస్తులను నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు.
మరకలపై వెంటనే సోడా వాటర్ పోసి, రుద్దితే మరకలు తొలగిపోతాయి, ముఖ్యంగా టీ మరకలకు ఇది చక్కగా పనిచేస్తుంది.
టూత్ పేస్ట్ (తెల్లటిది) కూడా మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. టూత్ పేస్ట్ ను మరకలపై రాసి రుద్ది 10 నిమిషాలు ఉంచి, చల్లటి నీళ్లతో ఉతకాలి.