Lifestyle

వాడిన టీ పొడితో ఇన్ని ప్రయోజనాలా?

టీ పొడిని పారేస్తున్నారా?

ప్రతి ఇంట్లో దాదాపు అందరి ఇళ్లల్లో వంట టీ తోనే మొదలౌతుంది. టీ చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని మనం చెత్తలో పడేస్తాం. కానీ..దానితో చాలా అద్భుతాలు చేయవచ్చట.

 

మొక్కలకు ఎరువుగా..

టీ పొడిని కాస్త ఎండలో ఆరపెట్టి.. తర్వాత కొద్దిగా మొక్కల మట్టిలో కలపండి లేదా నేరుగా వేళ్లలో వేయండి. మనీ ప్లాంట్, గులాబీ , ఇతర మొక్కలకు ఇది అద్భుతమైన ఎరువు.

శుభ్రపరిచేందుకు ఉపయోగించండి

మిగిలిన టీ పొడిని మళ్ళీ మరిగించండి. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో వేసి దానితో అద్దాలు, గాజు పాత్రలను శుభ్రం చేయండి.

జుట్టుకు ఉపయోగించండి

మిగిలిన టీ పొడి జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. మీరు దీన్ని మెహందీలో కలిపి రాసుకోవచ్చు లేదా దాని నీటితో జుట్టును కడగవచ్చు.

ఈగలు/కీటకాలను దూరంగా ఉంచండి

ఈగలు, కీటకాలను దూరంగా ఉంచడానికి, మిగిలిన టీ పొడిని మళ్ళీ మరిగించి, వడకట్టి, ఈ నీటితో ఈగలు , కీటకాలు వచ్చే ప్రదేశంలో తుడిస్తే సరిపోతుంది.

చాపింగ్ బోర్డు శుభ్రం చేయండి

చాపింగ్ బోర్డును శుభ్రం చేయడానికి ఒక స్పూన్ డిష్ వాష్ , నిమ్మరసం కలపండి. తర్వాత చాపింగ్ బోర్డుపై మిగిలిన టీ పొడిని వేసి డిష్ వాష్ లిక్విడ్‌తో శుభ్రం చేసుకోండి.

పాదాల దుర్వాసనను తొలగించండి

బూట్లు ధరించడం వల్ల పాదాల నుండి దుర్వాసన వస్తుంది. టీ పొడిని నీటిలో మరిగించి,వడకట్టి గోరువెచ్చని నీటిలో కలపాలి. ఆ నీటిలో  10 నిమిషాలు పాదాలను ముంచితే పాదాల దుర్వాసన తొలగిపోతుంది.

వీటిని తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి

కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఏమౌతుంది?

ఇక్కడకు వెళ్తే మిడ్ నైట్ కూడా సూర్యుడిని చూడొచ్చు

చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి సమయాల్లో నీళ్లు విషం అవుతాయి