Lifestyle
చాలా మంది వీక్లీ ఆఫ్ లో లేట్ గా పడుకోవడం, లేట్ గా లేవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఈ టైంలో కూడా మీరు ఎర్లీగా పడుకుని, ఎర్లీగా నిద్రలేవాలి. అప్పుడే మీరు ప్రతిరోజూ హాయిగా నిద్రపోతారు.
చలిపెడుతుంది కదా అని మరీ మందంగా ఉండే దుప్పట్లను వాడకండి. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటే సరిగ్గా నిద్రపట్టదు.
రాత్రిళ్లు మీకు బాగా నిద్రపట్టాలంటే పగటిపూట సాధ్యమైనప్పుడల్లా వెలుతురులోకి అంటే బయటకు వెళ్లండి. లేదా కిటికీ దగ్గర కూర్చోండి.
ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మీరు ఫిట్ గా, హెల్తీగా ఉండటమే కాదు.. మీకు బాగా నిద్రకూడా పడుతుంది. పడుకునే ముందు కొన్ని వ్యాయామాలు చేసినా కూడా మీకు బాగా నిద్రపడుతుంది.
చక్కెర నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టీ సాయంత్రం 6 తర్వాత టీ, కాఫీలను తాగకండి. ఇవి తాగితే మీకు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి పాలను తాగండి. ఈ పాలు మీకు బాగా నిద్రపట్టేలా చేస్తాయి.